Site icon HashtagU Telugu

SSR:సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబంలో విషాదం

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.

మంగ‌ళ‌వారం ఉద‌యం బీహార్‌లోని ల‌ఖిస‌రాయ్ జిల్లాలో జ‌తీయ‌ర‌హాదారి 333 లో సుశాంత్ కుటుంబ స‌భ్యులు ప్ర‌యాణిస్తున్నా కారు రోడ్డు ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు మ‌ర‌ణిచిచారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బావ హ‌ర్యానా సీనియ‌ర్ పోలీస్ అధికారి ఓపీ సింగ్ త‌న సోద‌రి గీతా దేవి అంత్య‌క్రియ‌ల‌కు పాట్నా వెళ్లారు. అంత్య‌క్రియ‌లు ముగిసిన అనంత‌రం పాట్నా నుండి కారులో తిరుగుప‌యాన‌మైయ్యారు. హ‌ల్సీ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని పిప్రా వ‌ద్ద మిడిల్ స్కూల్ స‌మీపంలోకి వ‌చ్చాక వీరు ప్ర‌యాణిస్తున్న కారు, ట్ర‌క్కు ఢీ కొట్టుకున్నాయి.

https://twitter.com/abhi_rocks1004/status/1460550336561643528

ఈ ప్ర‌మాదంలో కారు డ్రైవ‌ర్ స‌హా మొత్తం ఆరుగురు మ‌ర‌ణించిన‌ట్లు ల‌ఖిస‌రాయ్ ఎస్పీ సుశీల్ కుమార్ తెలిపారు. గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.
గాయపడిన వారిలో ఇద్దరు బల్ముకుంద్ సింగ్, దిల్ ఖుష్ సింగ్‌లను మెరుగైన చికిత్స సౌకర్యాల కోసం పాట్నాకు పంపగా, మిగిలిన ఇద్దరు బాల్మీకి సింగ్, తోను సింగ్‌లను లఖిసరాయ్ జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం లఖిసరాయ్‌ ఆస్పత్రికి తరలించారు. మృతులను లాల్‌జిత్ సింగ్ (ఓపీ సింగ్ బావ), అతని ఇద్దరు కుమారులు అమిత్ శేఖర్ అలియాస్ నేమని సింగ్ మరియు రామ్ చంద్ర సింగ్‌లుగా గుర్తించారు. మిగిలిన వారిని బేబీ దేవి, అనితాదేవి, డ్రైవర్ ప్రీతం కుమార్‌గా గుర్తించారు.