ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.

Published By: HashtagU Telugu Desk
Survey

Survey

Survey: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే (NDA) కూటమి విజయం సాధించి, వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే గత ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ లభించలేదు. తాజాగా ఒక కొత్త సర్వే వెలుగులోకి వచ్చింది. ‘నేడే లోక్‌సభ ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుంది?’ అనే అంశంపై ఈ సర్వే నిర్వహించారు. ‘ఇండియా టుడే – మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వే ప్రకారం.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధిస్తుందని, బీజేపీ సొంతంగానే మెజారిటీ మార్కును దాటుతుందని వెల్లడైంది. మరోవైపు 2024 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ సీట్లు తగ్గుతాయని సర్వే అంచనా వేసింది.

ఎవరికి ఎన్ని సీట్లు? (అంచనా)

ఈ సర్వే ప్రకారం, నేడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 287, కాంగ్రెస్‌కు 80, ఇతరులకు 176 సీట్లు వచ్చే అవకాశం ఉంది.

  • ఎన్డీయే (NDA)- 352
  • ఇండియా కూటమి (INDIA Alliance)- 182
  • ఇతరులు- 9

ఈ గణాంకాల ప్రకారం ప్రజల మద్దతు ఇప్పటికీ మోదీ ప్రభుత్వం వైపే ఉందని, 2024 ఎన్నికల కంటే ఈ మద్దతు మరింత బలపడిందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీకి 240, కాంగ్రెస్‌కు 99 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

ఓట్ల శాతం

సర్వే ప్రకారం.. ఎన్డీయే కూటమికి 47 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉండగా, ఇండియా కూటమికి 39 శాతం ఓట్లు లభిస్తాయని తేలింది. ఇతరులకు 14 శాతం ఓట్లు దక్కుతాయని అంచనా.

ఎన్నికల తర్వాత బలపడిన బీజేపీ

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. 400 కంటే ఎక్కువ సీట్లు గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఎన్డీయేకు మెజారిటీ వచ్చినా, బీజేపీ మాత్రం సొంతంగా మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయింది.

అయితే, లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన బీహార్, ఢిల్లీ, హర్యానా వంటి పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శన కనబరిచి విజయం సాధించింది. అంతేకాకుండా మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ తిరిగి పుంజుకుని, గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఈ విజయాలే తాజా సర్వేలో బీజేపీ బలం పెరగడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

 

  Last Updated: 29 Jan 2026, 08:21 PM IST