New Chief Minister : ‘‘కౌన్ బనేగా ఒడిశా ముఖ్యమంత్రి ?’’ ఇప్పుడు ఈ అంశంపై బీజేపీలో ముమ్మర చర్చ జరుగుతోంది. దీనిపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఒడిశా సీఎంను ఎంపిక చేసే బాధ్యతను కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేందర్‌యాదవ్‌లకు ప్రధాని మోడీ అప్పగించారు. బీజేపీ జాతీయ పరిశీలకుల హోదాలో వీరు ఒడిశా సీఎం ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. జూన్ 12న ఒడిశా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపటిలోగా సీఎం ఎంపిక ప్రక్రియను కొలిక్కి తేవాలనే పట్టుదలతో బీజేపీ హైకమాండ్ ఉంది. అంటే కాబోయే ఒడిశా సీఎంపై రేపటిలోగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బీజేపీ ఒడిశా శాసనసభా పక్ష సమావేశం కూడా జూన్ 11వ తేదీనే జరగనుంది. ఈ సమావేశంలోనే సీఎంను ఎంపిక చేసి, పార్టీ అధిష్టానం అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. జూన్ 12న ఒడిశా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా హాజరుకానున్నారు.
We’re now on WhatsApp. Click to Join
- ఒడిశా సీఎం(New Chief Minister) రేసులో సీనియర్ బీజేపీ నేత, ఎమ్మెల్యే సురేశ్ పుజారి ఉన్నారు.
- ఇటీవలే బీజేపీ పెద్దలు సురేశ్ పుజారిని ఢిల్లీకి పిలుచుకొని మంతనాలు చేశారు. ఆ సందర్భంగా సీఎం పోస్టును ఆయనకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
- 2019 లోక్‌సభ ఎన్నికల్లో బార్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి సురేశ్ పుజారి గెలిచారు.
- ఈసారి ప్రధాని మోడీ సూచన మేరకు సురేశ్ పుజారి ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు.
- బ్రజారాజ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి సురేశ్ పుజారి పోటీ చేసి గెలిచారు.
Also Read :Hacker : తెలంగాణ పోలీస్ యాప్స్ హ్యాక్.. 20 ఏళ్ల విద్యార్థి దొరికిపోయాడు
- ఈసారి ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించకుండానే బీజేపీ ఎన్నికల బరిలోకి దూకింది.
- అయినప్పటికీ ఒడిశాను వరుసగా దాదాపు 25 ఏళ్లు పాలించిన బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీని బీజేపీ ఓడించగలిగింది.
- ఒడిశాలోని మొత్తం 147 సీట్లకుగానూ 78 చోట్ల బీజేపీ గెలిచింది. 51 చోట్ల బీజేడీ గెలిచింది.