Modi Birthday Discount : ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ 73వ బర్త్ డే సందర్భంగా ఈరోజు (ఆదివారం) ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ లోని సూరత్ సిటీకి చెందిన ఆటోవాలాలు కీలక ప్రకటన చేశారు. ఇవాళ తమ ఆటోల్లో ప్రయాణించే వారికి 30 శాతం డిస్కౌంట్ ఇస్తామని వెల్లడించారు. సూరత్ నగరంలోని 1,000 మంది ఆటో డ్రైవర్లు కలిసికట్టుగా తమ యూనియన్ ద్వారా ఈ నిర్ణయాన్ని అనౌన్స్ చేశారు. ఆటో డ్రైవర్లు తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ అభినందించారు. ప్రధాని మోడీపై దేశ ప్రజలకు ఉన్న ప్రేమకు ఇది నిదర్శమని తెలిపారు.
Also read : PM Modi Last 5 Years Birthdays: గత 5 సంవత్సరాలు ప్రధాని మోదీ తన పుట్టినరోజు వేడుకలను ఎలా జరుపుకున్నారో తెలుసా..?
100 శాతం తగ్గింపు ప్రకటించిన 73 మంది డ్రైవర్లు
‘‘ దాదాపు వెయ్యిమంది ఆటో రిక్షా డ్రైవర్లు కలిసి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోడీ పుట్టినరోజు వేళ ప్రయాణికులకు 30 శాతం తగ్గింపును ప్రకటించారు. మరో 73 మంది ఆటో రిక్షా డ్రైవర్లు 100 శాతం తగ్గింపును ఇస్తామని అనౌన్స్ చేయడం ఆనందకరం. వారందరికీ నేను బీజేపీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని పూర్ణేష్ మోడీ పేర్కొన్నారు. మరోవైపు మోడీ బర్త్ డే సందర్భంగా గుజరాత్ లో బీజేపీ ఆధ్వర్యంలో సేవా పఖ్వారా అనే రెండు వారాల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా బీజేపీ కార్యకర్తలు రక్తదాన శిబిరాలు, స్వచ్ఛత డ్రైవ్‌లు, ఆరోగ్య శిబిరాలు (Modi Birthday Discount) నిర్వహిస్తారు.