Site icon HashtagU Telugu

Supreme Court: ఉచిత శానిటరీ ప్యాడ్ ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు..!!

Supreme Court

దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలని కోరుతూ దాఖలైన పిల్ పై సుప్రీంకోర్టులు కేంద్ర,రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై సమాధానం చెప్పాలని కోరింది. మధ్యప్రదేశ్ కు చెందిన వైద్యురాలు, సామాజిక కార్యకర్త జయఠాకూర్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం దీనిపై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమాధానాలు చెప్పాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది.

ఈ విషయానికి సంబంధించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సహాయాన్ని కూడా సుప్రీంకోర్టు కోరింది. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల్లోని బాలికలు పరిశ్రుభ్రతను ముఖ్యమైన సమస్యను పిటిషనర్ లేవనెత్తారని పేర్కొంది. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో బాలికలకు శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడమే కాకుండా ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని పిఐఎల్ లో పేర్కొంది. ఈ పిల్ జయఠాకూర్ దాఖలు చేశారు. యువతులు పరిశుభ్రత పాటించలేకపోతున్నారని…తన పిల్ లో పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలన్నీ ఈ విధంగా లేవన్నారు.

Exit mobile version