PM Modi: సుప్రీం కోర్టు తీర్పు.. వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుందిః ప్రధాని మోడీ

  • Written By:
  • Publish Date - March 4, 2024 / 02:19 PM IST

 

PM Modi: సుప్రీం కోర్టు(Supreme Court)ఈరోజు లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపులూ (Bribery Cases) ఇవ్వకూడదంటూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) స్వాగతించారు. ఇదో గొప్ప తీర్పు(great judgment) అంటూ ప్రశంసించారు. సుప్రీం తీర్పు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ‘సుప్రీంకోర్టు గొప్ప తీర్పు ఇచ్చింది. అది భవిష్యత్తులో స్వచ్ఛమైన రాజకీయాలను నిర్ధారిస్తూ.. వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుంది’ అని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. ఈ పోస్టుకు సుప్రీం తీర్పునకు సంబంధించిన కథనాన్ని కూడా జత చేశారు.

ఎంపీ, ఎమ్మెల్యేల లంచాల కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. లంచం కేసులో చట్టసభ సభ్యులకు మినహాయింపు లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది. ఆర్టిక‌ల్ 105, 194ను సాకుగా చూపి వాళ్లు విచార‌ణ నుంచి త‌ప్పించుకోవ‌డం కుద‌ర‌ద‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం తెలిపింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం ఈ తీర్పును ఇచ్చింది. ఆ బెంచ్‌లో జ‌స్టిస్ ఏఎస్ బొప్పన్న‌, ఎంఎం సుంద్రేశ్‌, పీఎస్ న‌ర‌సింహ‌, జేబీ ప‌ర్దివాలా, పీవీ సంజ‌య్ కుమార్, మ‌నోజ్ మిశ్రా ఉన్నారు.

పార్లమెంట్‌లో స‌భ్యులు ఏదైనా మాట్లాడినా లేక ఓటు వేసినా.. అలాంటి కేసుల్లో ఆర్టిక‌ల్ 105(2) ప్రకారం ఎంపీల‌కు పూర్తి ర‌క్షణ ఉంటుంది. ఆ ఆర్టిక‌ల్ ప్రకారం వాళ్లను విచారించ‌డం కుద‌ర‌దు. అలాగే ఎమ్మెల్యేల‌కు ఆర్టిక‌ల్ 194(2) ర‌క్షణ క‌ల్పిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

గ‌తంలో పీవీ న‌ర్సింహారావు కేసులో జ‌రిగిన విచార‌ణ‌ను విశ్లేషించామ‌ని, ఆ తీర్పుతో తాము ఏకీభ‌వించ‌డం లేద‌ని, ఆ తీర్పును కొట్టివేస్తున్నామ‌ని, ఎంపీల‌కు విచార‌ణ విష‌యంలో ఇమ్యూనిటీ ఇవ్వడం లేద‌ని, న‌ర్సింహారావు కేసులో ఇచ్చిన తీర్పు వ‌ల్ల ప్రమాదం ఉంద‌ని ఇవాళ సుప్రీం బెంచ్ అభిప్రాయ‌ప‌డింది.

ఆర్టిక‌ల్స్ 105(2), 194(2) ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు ర‌క్షణ క‌ల్పిస్తే , అప్పుడు అది యావ‌త్ స‌భా వ్యవ‌హారాల‌కు సంబంధం ఉన్నట్లు అవుతుంద‌ని కోర్టు తెలిపింది. పార్లమెంట‌రీ హ‌క్కుల ద్వారా అవినీతిప‌రుల్ని ర‌క్షించ‌డం స‌రైన విధానం కాదు అని కోర్టు చెప్పింది. లంచం ఇవ్వడం, తీసుకోవ‌డమే నేర‌మ‌ని కోర్టు స్పష్టం చేసింది.

read also : Raja Singh : బిజెపి అధిష్టానం ఫై అసంతృప్తి వ్యక్తం చేసిన రాజాసింగ్