Site icon HashtagU Telugu

Supreme Court: నీట్ యూజీ- 2024 ఫలితాలు రద్దు చేస్తారా..? జూలై 8న విచారణ చేయనున్న సుప్రీంకోర్టు..!

Supreme Court

Supreme Court

Supreme Court: మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. నీట్ యూజీ 2024 పరీక్ష రద్దుకు సంబంధించిన పిల్‌ను నేడు సుప్రీంకోర్టు (Supreme Court) విచారించింది. ఈ కేసును జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించింది. కోర్టులో దాఖలైన పిటిషన్‌లో.. అక్రమాలపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేయాలని, విచారణ పూర్తయ్యే వరకు కౌన్సెలింగ్‌ను నిషేధించాలని డిమాండ్‌ చేశారు.

అయితే, నీట్‌ పరీక్ష రద్దు, కౌన్సెలింగ్‌ నిషేధంపై పిటిషన్‌ దాఖలు చేసిన పిటిషనర్లకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. కౌన్సెలింగ్‌ను నిషేధించేందుకు కోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో సమాధానం ఇవ్వాలని కోరుతూ నీట్ పరీక్ష నిర్వహించే ఎన్టీఏకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఎన్టీఏ నుంచి సమాధానం వచ్చిన తర్వాత జూలై 8న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది.

67 మంది విద్యార్థులకు పూర్తి మార్కులు

నీట్ యూజీ పేపర్ లీక్ కేసుపై బీహార్ పోలీసులు ఇంతకుముందు దర్యాప్తు చేశారని, జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత 720కి 720 మార్కులు సాధించిన 67 మంది విద్యార్థుల్లో 6 మంది విద్యార్థులు ఒకే పరీక్ష కేంద్రానికి హాజరైనట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

Also Read: Delhi On High Alert: ఢిల్లీలో హై అలర్ట్.. ఉగ్రదాడి ముప్పు ఉందా..?

మళ్లీ పరీక్ష నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షలను నిర్వహించిందని మనకు తెలిసిందే. పరీక్ష నిర్వహించిన రోజు నుంచి ఏజెన్సీ విద్యార్థుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. పరీక్ష సక్రమంగా నిర్వహించకపోవడం, విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులపై విద్యార్థులు ఎన్టీఏపై ప్రశ్నలు సంధిస్తున్నారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join

ఇదిలా ఉండగా.. ఇప్పటికే నీట్ 2024కు హాజరైన 1,600 మంది విద్యార్థుల ఫిర్యాదులను ఉన్నతస్థాయి కమిటీ విశ్లేషించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్ణయించింది. నీట్ 2024 పేపర్ లీక్ పై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. విలేఖరుల సమావేశంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి మాట్లాడుతూ.. సవాయి మాధోపూర్‌లో మాత్రమే విద్యార్థులు పేపర్లతో సెంటర్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఆ సమయంలో అక్కడ పరీక్ష నిలిపివేసి మళ్లీ కొత్త పేపర్లతో పరీక్ష పెట్టారు. కేవలం 6 కేంద్రాల్లోనే సమస్యలు తలెత్తాయి. మిగతా చోట్ల ఎలాంటి అవాంతరాలు లేకుండా నీట్ పరీక్ష పూర్తయింది. పేపర్ లీక్ లాంటి ఘటనేమీ జరగలేదు. అదే సమయంలో పరీక్షపై దర్యాప్తు చేయడానికి NTA ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ తన నివేదికను వారంలో సమర్పించనుంది.