Site icon HashtagU Telugu

Delhi: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి షాకిచ్చిన సుప్రీంకోర్టు, నో బెయిల్

Manish Imresizer

Manish Imresizer

Delhi: దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ కేసు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులు అనేక మంది పేర్లు వినిపించినప్పటికీ, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మాత్రం జైలుపాలయ్యారు. తాజాగా సుప్రీంకోర్టులో కూడా ఊరట లభించలేదు. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నగదు బదిలీకి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తగిన ఆధారాలు సమర్పించిందని పేర్కొంది. రూ.38 కోట్ల నగదు బదిలీ వ్యవహారం ముడిపడిన కేసు కావడంతో సిసోడియాకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. గత ఎనిమిది నెలలుగా జైల్లో మగ్గుతున్న మనీశ్ మరికొన్ని నెలలు జైలు జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారని, పాలసీ వ్యాపారులకు అనుకూలంగా రూపకల్పన చేశారని మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ పాలసీపై సర్వత్రా విస్మయం రావడం, విషయం కోర్టుకు చేరడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ పాలసీని పక్కన పెట్టేసింది. అయితే, ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ జరిగింనే ఆరోపణలతో ఈడీ రంగంలోకి దిగింది. విచారణ ప్రారంభించి ఒక్కొక్కరినీ అరెస్టు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు.