Mughals Vs Red Fort: చివరి మొగల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్-2 వారసుడు మీర్జా మహ్మద్ బేదర్ భక్త్. ఈయన భార్య పేరు సుల్తానా బేగమ్. ఢిల్లీలోని ఎర్రకోట తమ వారసత్వ సంపద అని, దాన్ని అప్పగించాలని కోరుతూ భారత సుప్రీంకోర్టును సుల్తానా బేగమ్ ఆశ్రయించింది. దీనికి సంబంధించిన పిటిషన్‌ను 2021లో సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ‘‘భారత ప్రభుత్వం అక్రమంగా ఎర్రకోటను స్వాధీనం చేసుకుంది. దాన్ని మాకు ఇచ్చేయాలి’’ అని పిటిషన్‌లో సుల్తానా బేగమ్ ఆరోపించింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది అర్థం లేని పిటిషన్ అని న్యాయస్థానం పేర్కొంది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ.. ‘‘ఎర్రకోట మాత్రమే ఎందుకు ? ఫతేఫుర్ సిఖ్రీ, తాజ్ మహాల్‌లు కూడా కావాలని అడగొచ్చుగా.. దీనిపై మీరు వాదించాలని అనుకుంటున్నారా.. ఇదో చెత్త పిటిషన్’’ అని ఫైర్ అయ్యారు.
Also Read :India Vs Pakistan : రక్షణశాఖ కార్యదర్శితో మోడీ భేటీ.. రేపో,మాపో పీఓకేపై దాడి ?
ఢిల్లీ హైకోర్టులోనూ ఇదే విధంగా..
గతంలో ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టులోనూ సుల్తానా బేగమ్(Mughals Vs Red Fort) పిటిషన్ వేసింది. అయితేే అది కూడా కొట్టివేతకు గురైంది. భారత ప్రభుత్వం ఎర్రకోటను స్వాధీనం చేసుకున్న ఇన్నేళ్ల తర్వాత కోర్టును సుల్తానా బేగమ్ ఆశ్రయించడాన్ని అప్పట్లో ఢిల్లీ హైకోర్టు ఆనాడు తప్పుబట్టింది. అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సుల్తానా అప్పీల్ చేసింది.
Also Read :Prakash Raj : భయంలో బాలీవుడ్ యాక్టర్స్.. ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
మురికి వాడలో.. అద్దె ఇంట్లో..
సుల్తానా బేగమ్ భర్త మీర్జా మహ్మద్ బేదర్ భక్త్‌ను మొగల్ సామ్రాజ్యపు చివరి చక్రవర్తి బహదూర్ షా జఫర్ 2 వారసుడని భారత ప్రభుత్వమే 1960లో గుర్తించింది. అప్పటి నుంచి భారత ప్రభుత్వం ఆయనకు పెన్షన్ ఇస్తూ వచ్చింది. ఆయన చనిపోయిన తర్వాత 1980లో ఆ ఫించన్ సుల్తానా బేగమ్‌కు బదిలీ అయింది. అయితే ఫించన్ డబ్బులు తన జీవనానికి సరిపోవటం లేదని సుల్తానా బేగమ్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఫించన్ డబ్బులు సరిపోక ఢిల్లీలోని మురికివాడల్లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటోంది.