Site icon HashtagU Telugu

Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు షాక్.. బెయిల్ పొడిగింపు పిటిషన్ తిరస్కరణ

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉన్నందున.. జూన్ 1 వరకు తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ గడువును వారం రోజులు పొడిగించాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది. సాధారణ బెయిల్ కోసం దిగువ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ కేజ్రీవాల్‌కు ఉన్నందున, ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ స్పష్టం చేశారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోనున్నారు. కేజ్రీవాల్ ప్రస్తుతం పంజాబ్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. మే 30న రాత్రి తిరిగి ఢిల్లీకి చేరుకోనున్నారు.

We’re now on WhatsApp. Click to Join

మూత్రపిండాలు, తీవ్రమైన గుండె జబ్బులు, కేన్సర్, తదితర వ్యాధులను నిర్ధారించడానికి ఉద్దేశించిన వివిధ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వీలుగా తన మధ్యంతర బెయిల్ గడువును ఏడు రోజులు పొడిగించాలని కేజ్రీవాల్ (Arvind Kejriwal) తన పిటిషన్‌లో కోరారు. తాను తిరిగి తిహార్ జైలుకు వెళ్లడానికి షెడ్యూల్ తేదీ అయిన జూన్ 2కు బదులుగా జూన్ 9న జైలు అధికారుల ముందు లొంగిపోతానని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈమేరకు మే 26న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఆ పిటిషన్ తిరస్కరణకు గురైంది.  లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ దాదాపు 50 రోజుల పాటు ఢిల్లీలోని తిహార్ జైలులో 50 రోజులు కస్టడీలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆయనకు మే 10న 21 రోజుల మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల ఏడు దశల పోలింగ్ ఘట్టం జూన్ 1న ముగియనుంది. జూన్ 2న తిహార్ జైలులో కేజ్రీవాల్ లొంగిపోనున్నారు.

ఈ ఎన్నికల్లో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే తాను జైలు నుంచి బయటికి వస్తానని సీఎం కేజ్రీవాల్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి సర్కారు ఏర్పడ్డాక.. దేశంలోని కోర్టులపై రాజకీయ ఒత్తిళ్లు తొలగిపోతాయని ఆయన చెప్పారు. మొత్తం మీద కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే.. తనకు ఈ కేసుల నుంచి విముక్తి లభిస్తుందనే ఏకైక ఆశతో ఇప్పుడు కేజ్రీవాల్ ముందుకు సాగుతుండటం గమనార్హం.

Also Read : YS Jagan : జగన్ మెజారిటీ టాప్ 10లో ఉండదు..!