Ramdev : మేం గుడ్డివాళ్లం కాదు..ఈ కేసులో ఉదాసీనంగా ఉండ‌లేం: బాబా రాందేవ్‌పై సుప్రీం ఆగ్ర‌హం

  • Written By:
  • Publish Date - April 10, 2024 / 02:31 PM IST

Supreme Court: ప‌తంజ‌లి(Patanjali) కంపెనీ యాడ్స్(Company Ads)కేసులో ఈరోజు సుప్రీంకోర్టు(Supreme Court) మ‌రో సారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప‌తంజ‌లి వ్య‌వ‌స్థాప‌కుడు బాబా రాందేవ్‌(Baba Ramdev), బాల‌కృష్ణ(Balakrishna) స‌మ‌ర్పించిన క్ష‌మాప‌ణ‌ల‌(Apologies)ను కోర్టు తోసిపుచ్చింది. మేం గుడ్డివాళ్లం కాదు అని, ఈ కేసులో ఉదాసీనంగా ఉండ‌లేమ‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం పేర్కొన్న‌ది. ఈ కేసులో కేంద్ర స‌ర్కారు ఇచ్చిన వివ‌ర‌ణ కూడా సంతృప్తిక‌రంగా లేద‌ని సుప్రీం తెలిపింది. పేప‌ర్ మీద క్షమాప‌ణ‌లు చెప్పారు, కానీ వాళ్లు వెన్ను చూపిస్తున్నార‌ని, ఆ క్ష‌మాప‌ణ‌ల‌ను తాము అంగీక‌రించ‌డం లేద‌ని, కావాల‌నే ఉల్లంఘించిన‌ట్లు ఉంద‌ని జ‌స్టిస్ హిమా కోహ్లీ, జ‌స్టిస్ ఏ అమానుల్లాతో కూడిన ధ‌ర్మాస‌నం పేర్కొన్న‌ది.

రాందేవ్‌, బాల‌కృష్ణ‌లు త‌మ క్షమాప‌ణ ప‌త్రాల‌ను తొలుత మీడియాకు పంపార‌ని, స‌మ‌స్య కోర్టుకు వ‌చ్చేవర‌కు వాళ్లు త‌మ‌కు అఫిడ‌విట్ల‌ను పంప‌లేద‌ని, నిన్న రాత్రి ఏడున్న‌ర‌కు క్ష‌మాప‌ణ ప‌త్రాల‌ను మీడియాకు పంపార‌ని, కానీ త‌మ‌కు అప్‌లోడ్ చేయ‌లేద‌ని, వాళ్లు కేవ‌లం ప‌బ్లిసిటీని న‌మ్ముకున్నార‌ని జ‌స్టిస్ కోహ్లీ తెలిపారు. క్ష‌మాప‌ణ ప‌త్రాలు రిజిస్ట్రీకి అందాయా లేదా అన్న విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని ప‌తంజ‌లి కంపెనీ త‌ర‌పున వాదించిన సీనియ‌ర్ న్యాయ‌వాది ముఖుల్ రోహ‌త్గీ తెలిపారు. అఫిడ‌విట్‌ను డీఫ్రాడ్ చేస్తున్నార‌ని, ఎవ‌రు ఆ డ్రాఫ్ట్‌ను రూపొందించార‌ని, చాలా ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంద‌ని జ‌స్టిస్ అమానుల్లా తెలిపారు. లోపం జ‌రిగింద‌ని రోహ‌త్గీ అన్న మాట‌ల‌ను సుప్రీం ధ‌ర్మాస‌నం వ్య‌తిరేకించింది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, పతంజలి ఉత్పత్తులకు సంబంధించి తప్పుదారి పట్టించే ప్రకటనల విషయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఇలాంటి ప్రకటనలు ఇవ్వొద్దంటూ సర్వోన్నత న్యాయస్థానం పతంజలి ఆయుర్వేదకు నోటీసులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1 కోటి జరిమానా విధిస్తామని కూడా హెచ్చరించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషిన్‌లో కోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఆ తరువాత కూడా ప్రకటనలు కొనసాగడాన్ని కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. గతంలో ఇచ్చిన తీర్పును అమలు పరచనందుకు వారిపై కోర్టు ధిక్కరణ నేరం కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గతంలో చెప్పిన క్షమాపణలు అసంపూర్తిగా ఉన్నాయని, నిజాయతీ లోపించిందని వ్యాఖ్యానించిన కోర్టు చివరి అవకాశం ఇస్తున్నట్టు ఏప్రిల్ 2 నాటి తీర్పులో పేర్కొంది.

Read Also: Geetanjali Malli Vacchindi : అంది వచ్చిన ఛాన్స్.. అందుకుంటారా.. వదిలేస్తారా..?

ఈ క్రమంలో రామ్‌దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. ‘‘జరిగిన పొరపాటుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. భవిష్యత్తులో దీన్ని పునరావృతం కానీయనని మాటిస్తున్నాను. కోర్టు ఆదేశాల ఉల్లంఘన జరిగినందుకు బేషరుతుగా క్షమాపణలు చెబుతున్నాను’’ అని రామ్‌దేవ్ బాబా అఫిడవిట్ దాఖలు చేశారు.