APP : కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బ.. తక్షణ విచారణ కుదరదన్న సుప్రీంకోర్టు

  • Written By:
  • Publish Date - May 28, 2024 / 12:59 PM IST

Arvind Kejriwal: ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు(Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో బెయిల్‌ పొడిగింపు(Extension of bail) కోరుతూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు(Filing of Petition) చేశారు. ఈ మేరకు బెయిల్ పొడిగింపు పిటిషన్‌ పై తక్షణ విచారణ కోరుతూ అరవింద్‌ తరపు లాయర్ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం వెకేషన్ బెంచ్ తిరస్కరించింది(refused). ఈ పిటిషన్ గురించి గత వారం ప్రధాన బెంచ్‌ ముందుకు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించింది. ఈ కేసులో తీర్పు రిజర్వ్ లో ఉన్నందుకు పిటిషన్‌ లిస్టింగ్ పై తగు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ కేసులో జూన్ 1 వరకూ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో కేజ్రీవాల్‌(Kejriwal) మాట్లాడుతూ తన బరువు నెల రోజుల వ్యవధిలో అకారణంగా 7 కేజీల మేర తగ్గిందన్నారు. ఇది తీవ్ర అనారోగ్య సమస్యకు సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. పీఈటీ-సీటీ స్కాన్ సహా పలు ఇతర వైద్య పరీక్షల కోసం ఏడు రోజుల సమయం పడుతుందని, ఇందుకు అనుగుణంగా బెయిల్ పొడిగించాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించినట్టు తెలిపారు. మే 10 న ఆయన తీహాడ్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. అంతేకాక..వైద్య పరీక్షల కోసం బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలంటూ కేజ్రీవాల్ సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Read Also: Back To School : బ్యాక్‌ టూ స్కూల్‌.. పాఠశాలకు వెళ్లనని మీ పిల్లలు మారం చేస్తే..!