Places Of Worship Case: దేశంలోని పలు ప్రార్థనా స్థలాలకు సంబంధించిన అంశంలో కొత్త పిటిషన్ల దాఖలుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లకు ఇక ముగింపు పలకాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ అంశంపై దాఖలైన కొత్త పిటిషన్లను విచారణకు చేపట్టే ప్రసక్తే లేదని వెల్లడించింది. అయితే ఇప్పటికే దాఖలైన పిటిషన్లకు సంబంధించిన అదనపు అంశాలను జతచేస్తూ కొత్త పిటిషన్లు వేయడాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం అనుమతించింది.
Also Read :Ayodhya Ram Mandir: షిర్డీ, వైష్ణోదేవి ఆలయాలను దాటేసిన అయోధ్య రామమందిరం
‘‘కొత్త పిటిషన్లు దాఖలు చేయడానికి గతంలో అనుమతించాం. కానీ ఇలాంటి వ్యాజ్యాలకు ఒక పరిమితి ఉండాలి. ప్రార్థన స్థలాలకు సంబంధించిన కొత్త పిటిషన్లు దాఖలు చేస్తే, అందులో కొత్త అంశాలను జోడించాలి. అలా అయితేనే వాటిని విచారణకు చేపడతాం’’అని సుప్రీంకోర్టు బెంచ్ తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. ఇప్పటివరకు దాఖలు చేసిన కొత్త పిటిషన్లపై సుప్రీంకోర్టు బెంచ్(Places Of Worship Case) ఎలాంటి స్పష్టతనూ ఇవ్వలేదు.
Also Read :US Seal Vs Laden: లాడెన్‌ను కడతేర్చిన అమెరికా సీల్.. ఏం చేస్తున్నాడో తెలిస్తే షాకవుతారు!
ఇవాళ (సోమవారం) ప్రార్థనా స్థలాల చట్టం 1991 కింద దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్, మజ్లిస్‌తో పాటు ఇతర రాజకీయ పార్టీలు ‘1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని’ కఠినంగా అమలు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశాయి. ఈ పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనల్ని వినిపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా మన దేశంలోని పలు ప్రాంతాల్లో కొత్తగా మందిరం-మసీదు వివాదాలు పుట్టుకొస్తున్నాయి. ఈ జాబితాలో కాశీ విశ్వనాథ్-జ్ఞానవాపి, శ్రీకృష్ణ జన్మస్థలం- మధుర ఈద్గా, శంభాల్ దర్గా వంటి వివాదాలు తెరపైకి వచ్చాయి. గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడే ఈ పిటిషన్లు ఎందుకు దాఖలు అవుతున్నాయి ? కారణం ఏమిటి ? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.