Site icon HashtagU Telugu

News click : న్యూస్‌ క్లిక్‌ ఎడిటర్‌ విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం

Supreme Court orders release of News Click editor

Supreme Court orders release of News Click editor

News Click Editor: ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఢిల్లీ పోలీసులు న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ(Prabir Purkayastha)ను అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని.. తక్షణమే ఆయను విడుదల చేయాలని సుప్రీంకోర్టు( Supreme Court)
ఆదేశించింది. జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి, సందీప్ మెహ‌తాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించింది. ఈ కేసులో రిమాండ్ కాపీని ఇవ్వాల‌ని ధ‌ర్మాస‌నం తెలిపింది. అందుకే ఎడిట‌ర్ అరెస్టును కోర్టు త‌ప్పుప‌ట్టింది. ఎందుకు అరెస్టు చేశార‌న్న అంశానికి సంబంధించిన విష‌యాల‌ను కోర్టుకు వెల్ల‌డించ‌లేద‌ని, పంక‌జ్ బ‌న్స‌ల్ కేసు త‌ర‌హాలో అత‌న్ని క‌స్ట‌డీ నుంచి రిలీజ్ చేయాల‌ని ఆదేశిస్తున్నామ‌ని, రిమాండ్ ఆర్డ‌ర్ చెల్ల‌ద‌ని జ‌స్టిస్ మెహ‌తా తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ప్రబీర్ పుర్కాయస్థను గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన ఉపా( UAPA) చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. చైనా ఏజెండా గురించి కథనాలు ప్రచురిస్తున్న న్యూస్‌ క్లిక్ సంస్థకు అక్రమంగా నిధులు వస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆరోపలు గుప్పించింది. ఆ కేసులో న్యూస్‌ క్లిక్ ఎడిటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రాగన్ కంట్రీ చైనాకు అనుకూలంగా రాసేందుకు టెర్రర్ ఫండింగ్ జరిగినట్లు 8 వేల ఫేజీల ఛార్జ్ షీట్లో ఢిల్లీ పోలీసులు ఆరోపణలు చేశారు. అలాగే, ఇదే, కేసులో న్యూస్‌క్లిక్ హెచ్ఆర్ అధిపతి అమిత్ చక్రవర్తిని కూడా అక్టోబర్ 3న అరెస్ట్ చేశారు.

Read Also: PM Modi : ‘‘ఎక్కువ మంది పిల్లలున్న వాళ్లు’’ అంటే ముస్లింలే కాదు.. పేదలు కూడా : మోడీ

మరోవైపు ఢిల్లీ పోలీసులు ఇటీవలే పుర్కాయస్థ, న్యూస్‌క్లిక్‌లపై చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఢిల్లీ కోర్టు ఈ చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకుంది. ఈ నెల 31న ఇది విచారణకు రానుంది.