Site icon HashtagU Telugu

Rajiv Gandhi Assassination: రాజీవ్ హ‌త్య దోషులకు `సుప్రీం` ఊర‌ట‌

Rajeev

Rajeev

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఇత‌ర కేసుల్లో అవ‌స‌రంలేని ఖైదీలందరినీ విడుదల చేయాలని సూచించింది. రాజీవ్ గాంధీతో పాటు మరో 21 మందిని చంపిన బాంబు దాడి కేసులో ప్రధాన నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

దోషులుగా ఉన్న నళిని, సంతన్, మురుగన్, శ్రీహరన్, రాబర్ట్ పయస్, రవిచంద్రన్‌లు జైలు నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మరో నిందితుడు ఏజీ పెరారివాలన్‌ దాఖలు చేసిన రిలీఫ్‌ పిటిషన్‌పై గతంలో ఇచ్చిన తీర్పుతో సమానంగా అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది.

పెరారివాలన్ కేసులో, క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్ చేసిన జాప్యాన్ని సుప్రీంకోర్టు గమనించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం అధికారాలను అమలు చేసింది.