Alimony Deciding Factors : విడాకుల భరణం నిర్ణయించడానికి 8 మార్గదర్శకాలు.. జారీ చేసిన సుప్రీంకోర్టు

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీవీ వర్లేలతో కూడిన ధర్మాసనం భరణం(Alimony Deciding Factors) కింద ఇచ్చే నగదుకు సంబంధించిన కీలకమైన 8 మార్గదర్శకాలను జారీచేసింది.

Published By: HashtagU Telugu Desk
Alimony Deciding Factors Supreme Court

Alimony Deciding Factors : భార్య నిఖిత సింఘానియా వేధింపులను తట్టుకోలేక బెంగళూరులో టెకీ అతుల్‌ సుభాష్‌ సూసైడ్ చేసుకోవడం యావత్ దేశంలో సంచలనంగా మారింది. అతడు సూసైడ్ చేసుకోవడానికి ముందు.. ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. అంతేకాదు తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ ఒక సూసైడ్ నోట్‌ను రాశాడు. భార్య నిఖిత సింఘానియా విడాకుల సమయంలో రూ.3 కోట్లు ఇవ్వాలని,  నెలకు రూ. 2లక్షల భరణం కావాలని డిమాండ్ చేసినట్లు అతుల్ సుభాష్ తన సూసైడ్ నోట్‌లో ప్రస్తావించాడు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీవీ వర్లేలతో కూడిన ధర్మాసనం భరణం(Alimony Deciding Factors) కింద ఇచ్చే నగదుకు సంబంధించిన కీలకమైన 8 మార్గదర్శకాలను జారీచేసింది. ఇకపై ఈ మార్గదర్శకాల ప్రకారమే దేశవ్యాప్తంగా కోర్టులు విడాకుల కేసుల్లో భరణాన్ని నిర్ణయించాలని నిర్దేశించింది. విడాకుల సమయంలో శాశ్వత భరణం నిర్ణయించడం అనేది సాధారణమైన విషయమేం కాదని సుప్రీంకోర్టు బెంచ్ ఈసందర్భంగా వ్యాఖ్యానించింది. బెంగళూరు టెకీ అతుల్‌ సుభాష్‌ సూసైడ్ జరిగి 48 గంటలు గడవకముందే సుప్రీంకోర్టు ఈ మార్గదర్శకాలను జారీ చేయడం గమనార్హం.

Also Read :Yuvraj Singh Birthday : రికార్డుల రారాజు యువ‘రాజ్’‌కు హ్యాపీ బర్త్‌డే.. కెరీర్ విశేషాలివీ

భరణాన్ని నిర్ణయించే 8 మార్గదర్శకాలివే

  • భార్యాభర్తల సామాజిక, ఆర్ధిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలి.
  • భవిష్యత్తులో భార్యాపిల్లల ప్రాథమిక అవసరాలను అంచనా వేయాలి.
  • భార్యాభర్తల ఉద్యోగాలు, విద్యార్హతలు, ఆదాయాలు, ఆస్తుల వివరాలను పరిగణనలోకి తీసుకోవాలి.
  • భార్యాభర్తల ఆదాయం, ఆస్తి వంటి సాధనాల వివరాలను పరిగణనలోకి తీసుకోవాలి.
  • అత్తవారింట్లో ఉన్నప్పుడు భార్య జీవన ప్రమాణం ఏమిటి అనేది తెలుసుకోవాలి.
  • కుటుంబం కోసం భార్య  ఉద్యోగాన్ని వదిలేసిందా? అనే విషయాన్ని తెలుసుకోవాలి.
  • ఉద్యోగం చేయని భార్యకు న్యాయ పోరాటానికి తగిన మొత్తం అందించాలి.
  • భర్త ఆర్థిక పరిస్థితి, ఆదాయాల వివరాలు తెలుసుకోవాలి. వాటి ఆధారంగా అతడికి భరణం నిర్ణయించాలి.

Also Read :Judge Vs India Bloc : ‘‘హిందుస్తాన్’’ వ్యాఖ్యలు.. హైకోర్టు జడ్జిపై ‘ఇండియా’ కూటమి అభిశంసన తీర్మానం

  Last Updated: 12 Dec 2024, 11:00 AM IST