Hindu Marriages : హిందూ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Hindu Marriage Act: సుప్రీంకోర్టు(Supreme Court) ధర్మాసనం హిందూ వివాహాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన వేడుక లేకుండా కేవలం వివాహాన్ని(Hindu marriages) రిజిస్ట్రేషన్ చేయడం హిందూ వివాహ చట్ట ప్రకారం చెల్లదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వివాహ వేడుక లేకుండానే యువతీ యువకులు భార్యభర్తల హోదాను పొందాలనుకునే ఆచారాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. వివాహం పవిత్రమైనదని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. We’re now on WhatsApp. Click to Join. ఈ మేరకు జస్టిస్ బి.వి. […]

Published By: HashtagU Telugu Desk
Supreme Court Key Comments on Hindu Marriages

Supreme Court Key Comments on Hindu Marriages

Hindu Marriage Act: సుప్రీంకోర్టు(Supreme Court) ధర్మాసనం హిందూ వివాహాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన వేడుక లేకుండా కేవలం వివాహాన్ని(Hindu marriages) రిజిస్ట్రేషన్ చేయడం హిందూ వివాహ చట్ట ప్రకారం చెల్లదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వివాహ వేడుక లేకుండానే యువతీ యువకులు భార్యభర్తల హోదాను పొందాలనుకునే ఆచారాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. వివాహం పవిత్రమైనదని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ మేరకు జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్‌ అగస్టిన్ జార్జ్‌ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలను చేసింది. ఇద్దరు వ్యక్తుల జీవితకాల, గౌరవాన్ని ధృవీకరించే, సమానమైన, అంగీకరంతో, ఆరోగ్యకరమైన కలయికను అందిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది.

Read Also: Shyam Rangeela : ప్రధాని మోడీపై మిమిక్రీ మ్యాన్ శ్యామ్ రంగీలా పోటీ.. ఎవరు ?

హిందూవివాహ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం.. సంప్రదాయబద్ధంగా వేడుక లేకుండా వివాహాలు జరిగితే.. ఏ సంస్థ జారీ చేసిన సర్టిఫికెట్‌కు కూడా చట్టబద్ధత ఉండదని సుప్రీంకోర్టు వెల్లడించింది. విదేశాలక వలస వెళ్లడానికి వీసా కోసం దరఖాస్తు చేయడానికి యువ జంటల తల్లిదండ్రులు వివాహ నమోదుకు అంగీకరిస్తున్నారని గమనించినట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సమయాన్ని ఆదా చేయచ్చు కానీ.. వివాహ వేడుకను పెండింగ్‌లో ఉంచుతున్నారని తెలిపింది. ఇలాంటి పద్దతులను తొలగించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది.

Read Also: Gannavaram : అయ్యో..కళ్లముందే 10,500 లీటర్ల మద్యం ధ్వంసం

భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థకు పవిత్రత ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. వివాహం అనేది పాటలు, డ్యాన్స్‌లు, భోజనాలు చేయడం, కట్నకానుకలు, గిఫ్ట్‌లు తీసుకొనే సందర్భం కాదని వ్యాఖ్యానించింది. భార్యాభర్తల హోదాను పొందే స్త్రీ, పురుషుల మధ్య సంబంధాన్ని నెలకొల్పడానికి జరుపుకునే పవిత్ర పునాది కార్యక్రమం ఇది అంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. పెళ్లిలో భార్యభర్తలుగా ఒక్కటయ్యే దంపతులు ఏడడుగులు వేసే సప్తపది లాంటి సంప్రదాయ ఆచారాలను నిర్వహంచకపోతే అది హిందూ వివాహం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

 

 

 

  Last Updated: 02 May 2024, 01:05 PM IST