DK Shivakumar: మనీలాండరింగ్‌ కేసులో సుప్రీంలో డీకేకి ఊరట

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై మనీలాండరింగ్ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. మనీలాండరింగ్ కేసులో తనకు జారీ చేసిన ఈడీ సమన్లను రద్దు చేసేందుకు నిరాకరించిన కర్ణాటక హైకోర్టు ఆదేశాలపై డీకే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

DK Shivakumar: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై మనీలాండరింగ్ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. మనీలాండరింగ్ కేసులో తనకు జారీ చేసిన ఈడీ సమన్లను రద్దు చేసేందుకు నిరాకరించిన కర్ణాటక హైకోర్టు ఆదేశాలపై డీకే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తులు సూర్యకాంత్ మరియు కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం శివకుమార్‌కు ఉపశమనం మంజూరు చేసింది.

ఆగస్ట్ 2017లో ఆదాయపు పన్ను శాఖ ఆయన నివాసాలపై దాడులు చేయడంతో శివకుమార్ చుట్టూ వివాదం మొదలైంది. ఈ దాడుల్లో సుమారు రూ. 300 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి 2019లో ఈడీ డీకేని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి నెల ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.

కాగా గతేడాది చివర్లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 23 నవంబర్ 2023న, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును దర్యాప్తు చేసేందుకు సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం సీబీఐకి మంజూరు చేసిన అనుమతిని ఉపసంహరించుకుంది.

Also Read: Dasoju Sravan: ఎలా మాట్లాడాలో రేవంత్ రెడ్డికి చెప్పాండి: దాసోజు శ్రవణ్ సూచన