Site icon HashtagU Telugu

Supreme Court: సుప్రీం సంచలన నిర్ణయం.. బిల్కిస్ బానో పిటిషన్‌ కొట్టివేత

Group 1 Exam Supreme Court TSPSC TGPSC Telangana

బిల్కిస్ బానో (Bilkis Bano) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) శనివారం కొట్టివేసింది. ఇందులో 1992 పాలసీ ప్రకారం దోషులకు మినహాయింపు ఇవ్వడాన్ని పరిగణించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరుతూ దాని ఆదేశాలను సమీక్షించాలని సుప్రీంకోర్టు (Supreme Court)ను డిమాండ్ చేసింది. బిల్కిస్ బానో అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభ‌వించిన 11 మందిని ఇటీవ‌ల గుజ‌రాత్ ప్ర‌భుత్వ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. గ్యాంగ్ రేప్ నిందితుల రిలీజ్‌ను స‌వాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో శనివారం రివ్యూ పిటిష‌న్ వేసింది. ఆ పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు తిర‌స్క‌రించింది.

2002 గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ పై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో 11 మంది దోషులకు జీవిత ఖైదు విధించబడింది. అయితే.. గుజరాత్ ప్రభుత్వం 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత దోషులను విడుదల చేసింది. గుజరాత్ ప్రభుత్వం తమ క్షమాభిక్ష విధానానికి అనుగుణంగా 11 మంది దోషులకు మినహాయింపునిచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ దోషులు జైలు నుంచి విడుదలయ్యారు. గోద్రా సబ్ జైలులో 15 ఏళ్లకు పైగా శిక్ష అనుభవించిన తర్వాత దోషులు విడుదలయ్యారు. దోషుల విడుదలను సవాల్ చేస్తూ.. ముందస్తు విడుదలను సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో మే 13 నాటి ఉత్తర్వులను పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు.

ఇందులో గ్యాంగ్‌రేప్ దోషుల విడుదలకు 1992లో రూపొందించిన నిబంధనలే వర్తిస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది. దీని ఆధారంగా 11 మంది ఖైదీలను విడుదల చేశారు. అదే సమయంలో బిల్కిస్ బానో తరపు న్యాయవాది లిస్టింగ్ కోసం భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ముందు ఈ విషయాన్ని ప్రస్తావించారు. విడుదలైన 11 మంది దోషుల్లో జస్వంత్ నాయ్, గోవింద్ నాయ్, శైలేష్ భట్, రాధేశ్యామ్ షా, బిపిన్ చంద్ర జోషి, కేసర్‌భాయ్ వోహానియా, ప్రదీప్ మొరాధియా, బకాభాయ్ వోహానియా, రాజుభాయ్ సోనీ, మితేష్ భట్ మరియు రమేష్ చందనా ఉన్నారు.

Exit mobile version