Site icon HashtagU Telugu

Deputy Chief Ministers : ఉప ముఖ్యమంత్రుల నియామ‌కంపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

UP Madarsa Act Constitutional: Supreme Court

UP Madarsa Act Constitutional: Supreme Court

 

supreme-court : సుప్రీంకోర్టు ఈరోజు ఉప ముఖ్యమంత్రుల(Deputy Chief Ministers) నియామ‌కంపై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. డిప్యూటీ సీఎంల నియామ‌కం రాజ్యాంగ వ్య‌తిరేకం కాదు అని కోర్టు తెలిపింది. ఇప్ప‌టికి ప‌లు రాష్ట్రాలు డిప్యూటీ సీఎంల‌ను నియ‌మిస్తున్న విష‌యం తెలిసిందే. పార్టీల్లో ఉన్న సీనియ‌న్ నేత‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ, కొన్ని సంద‌ర్భాల్లో కూట‌మి ప్ర‌భుత్వాల ఏర్పాటు కోసం డిప్యూటీ సీఎం ప‌ద‌వుల‌ను ఏర్పాటు చేస్తున్నారు.

చీఫ్ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్(Chief Justice DY Chandrachud)నేతృత్వంలోని జేబీ ప‌ర్దివాలా, మ‌నోజ్ మిశ్రాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఇవాళ ఈ తీర్పును ఇచ్చింది. రాజ్యాంగ విలువ ప్ర‌కారం డిప్యూటీ సీఎంల నియామ‌కం జ‌రుగుతుంద‌ని ధ‌ర్మాసనం తెలిపింది. ముఖ్య‌మంత్రి ప‌రిధిలో ఉండే మంత్రిమండ‌లిలో డిప్యూటీ సీఎంలు భాగ‌మ‌ని కోర్టు పేర్కొన్న‌ది.

<span style=”color: #ff0000;”><strong>We’re now on WhatsApp</strong></span>. <a href=”https://whatsapp.com/channel/0029Va94sppFy72LQLpLhB0t”><strong>Click to Join.</strong></a>

డిప్యూటీ సీఎంల నియామ‌కాన్ని త‌ప్పుప‌డుతూ దాఖ‌లైన పిల్‌ను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. డిప్యూటీ పోస్టుల గురించి రాజ్యాంగంలో ఎక్క‌డా లేద‌ని పిటీష‌న‌ర్లు వాదించారు. అయితే డిప్యూటీ సీఎంల నియామ‌కం రాజ్యాంగ ఉల్లంఘ‌న కింద‌కు రాదు అని సుప్రీంకోర్టు తెలిపింది.

 

read also : TS : అసెంబ్లీ లో నదీజలాల అన్యాయంపై ఉత్తమ్ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌