Waqf Act : వక్ఫ్ సవరణ చట్టంలోని పలు నిబంధనల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన 72 పిటిషన్లపై ఇవాళ (గురువారం) కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మే 5న జరగనున్న తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటీఫై చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకు కేంద్ర సర్కారు కూడా అంగీకారం తెలిపింది. అప్పటివరకు వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించొద్దని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి నిర్దేశించింది. దీనికి కూడా సర్కారు ఓకే చెప్పింది.
Also Read :Aliens Attack: ఏలియన్స్ ఎటాక్.. రాళ్లుగా మారిన సైనికులు.. సంచలన నివేదిక
వక్ఫ్‌గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను..
వక్ఫ్ సవరణ చట్టాన్ని(Waqf Act) సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లతో ముడిపడిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. అందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఓకే చెప్పింది. తదుపరి విచారణ మే 5న జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వానికి సమాధానం ఇచ్చేందుకు అప్పటివరకు అవకాశం ఇస్తామని సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది. అయితే అప్పటివరకు వక్ఫ్ ఆస్తులను డీనోటీఫై చేయొద్దని తేల్చి చెప్పింది. వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించొద్దని స్పష్టంచేసింది. ‘‘వక్ఫ్‌గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్ జాబితా నుంచి తొలగించకూడదు. వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా కచ్చితంగా ముస్లింలే అయి ఉండాలి. మతంతో సంబంధం లేకుండా ఎక్స్-అఫీషియో సభ్యులను నియమించొచ్చు’’ అని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎదుట సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. ఈ మేరకు వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు ప్రతిపాదనలను రెడీ చేసింది.
Also Read :Telangana Govt Jobs: ఉద్యోగాల జాతర.. 18,236 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్లు
వక్ఫ్ బోర్డు లాభాన్ని పేద ముస్లింలకే పంచుతాం : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
వక్ఫ్ బోర్డు ఆస్తులపై వచ్చే ఆదాయంలో లాభాన్ని పేద ముస్లింలకు పంచుతామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎప్పటికప్పుడు ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ‘‘ప్రధాని మోడీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులను డిజిటలైజేషన్ చేస్తుంది. దేశ వ్యాప్తంగా లక్షల ఎకరాల వక్ఫ్ భూమి కబ్జాకు గురైంది. ముస్లిం సమాజం వాస్తవాలు గుర్తించాలి. జిల్లాల్లో నిర్వహించే సమావేశాలకు అన్ని వర్గాల వారిని ఆహ్వానించాలి’’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.