Rahul : రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Rahul : ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతుండగా లక్నోలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ వ్యాఖ్యలపై విచారణ ప్రారంభమైంది

Published By: HashtagU Telugu Desk
Such killings must end soon: Rahul Gandhi

Such killings must end soon: Rahul Gandhi

కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul) ఇటీవల స్వాతంత్య్ర సమరయోధుడు వీర సావర్కర్‌ (Veer Savarkar)పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతుండగా లక్నోలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ వ్యాఖ్యలపై విచారణ ప్రారంభమైంది. స్వాతంత్య్ర సమరయోధుల పట్ల ఈ విధంగా మాట్లాడటం సరైంది కాదని పలువురు అభిప్రాయపడ్డారు.

Chubby Cheeks: బుగ్గలు మరీ లావుగా ఉన్నాయా.. ఈ విధంగా చూస్తే చాలు బుగ్గలు ఈజీగా కరిగిపోవాల్సిందే!

ఈ వ్యవహారంలో రాహుల్ గాంధీకి ఉపశమనం కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించినా, ఏప్రిల్ 4న హైకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీనితో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, శుక్రవారం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం ఈ కేసును విచారించింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని, స్వాతంత్య్ర సమరయోధులపై ఇలాంటివి వ్యాఖ్యలు సరైనవి కాదని కోర్టు స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించింది. “ఇలాంటి ప్రవర్తనను మేము ఊహించలేం. మీరు జాగ్రత్తగా ఉండాలి” అని కోర్టు సుముఖుంగా హెచ్చరిక జారీ చేసింది. ఈ కేసుపై తాత్కాలికంగా స్టే విధించినప్పటికీ, ఇకపై రాహుల్ గాంధీ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే సుమోటోగా చర్యలు తీసుకోవడానికి కోర్టు సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది.

  Last Updated: 25 Apr 2025, 12:52 PM IST