Lakhimpur Kheri case : లఖింపుర్ ఖేరి కేసులో ఆశిష్ మిశ్రాకు సుప్రీం బెయిల్‌

ఆవిష్‌ మిశ్రాకు న్యాయమూర్తులు సూర్యకాంత్‌, ఉజ్వల్‌ భుయాన్‌లో కూడిన ధర్మాసనం సోమవారం బెయిల్‌ ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - July 22, 2024 / 02:28 PM IST

Lakhimpur Kheri case: 2021లో జరిగిన లఖింపూర్‌ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో నిందితుడైన మాజీ కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా(Ajay Mishra) కుమారుడు అశిష్‌ మిశ్రా(Ashish Mishra)కు ఈరోజు సుప్రీంకోర్టు(Supreme Court) బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు ఆవిష్‌ మిశ్రాకు న్యాయమూర్తులు సూర్యకాంత్‌, ఉజ్వల్‌ భుయాన్‌లో కూడిన ధర్మాసనం సోమవారం బెయిల్‌ ఇచ్చింది. ఆశిష్ మిశ్రా వాహ‌నం దూసుకెళ్లిన ఘ‌ట‌న‌లో 8 మంది మృతిచెందిన విస‌యం తెలిసిందే. అయితే ఆశిష్ మిశ్రా.. ఢిల్లీ లేదా ల‌క్నోలోనే ఉండాలంటూ కోర్టు త‌న ఆదేశాల్లో స్ప‌ష్టం చేసింది. గ‌త ఏడాది జ‌న‌వ‌రి 25వ తేదీన‌.. సుప్రీంకోర్టు ఆశిష్ మిశ్రాకు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరీ చేసింది. ల‌ఖింపుర్ ఖేరి కేసులో విచార‌ణ చేప‌డుతున్న ట్ర‌య‌ల్ కోర్టు వేగంగా వాద‌న‌ల‌ను పూర్తి చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓ టైం షెడ్యూల్ ప్ర‌కారం ఆ కేసును పూర్తి చేయాల‌ని సుప్రీం సూచించింది.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు ఈ కేసులో జస్టిస్‌ సూర్యకాంత్‌, ఉజ్వల్‌ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం రైతులకు కూడా బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మంది సాక్ష్యుల్లో కేవలం ఏడు మందిని మాత్రమే విచారించారని, ఈ కేసును వేగ‌వంతంగా విచార‌ణ చేప‌ట్టాల‌ని కోర్టు తెలిపింది. కాగా, యూపీ డిప్యూటీ సీఎం కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య ప‌ర్య‌ట‌న‌ను వ్య‌తిరేకిస్తూ రైతులు ఆందోళ‌న చేప‌ట్టారు. ఆ స‌మ‌యంలో ఓ వాహ‌నం రైతుల మీద‌కు దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆవేశంలో రైతులు కూడా అటాక్ చేశారు. ఆ దాడిలో వాహ‌న డ్రైవ‌ర్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు బీజేపీ కార్య‌క‌ర్త‌లు ప్రాణాలు కోల్పోయారు. అక్క‌డ జ‌రిగిన హింస‌లో ఓ జ‌ర్న‌లిస్టు కూడా ప్రాణాలు కోల్పోయాడు.

Read Also: AP Assembly Sessions : జగన్ తో రఘురామ చెప్పిన మాటలు ఇవే..

 

 

 

 

 

Follow us