Site icon HashtagU Telugu

Sunita Kejriwal: సునీత కేజ్రీవాల్ గురించి ఎవరికీ తెలియని విషయాలు

Sunita Kejriwal

Sunita Kejriwal

Sunita Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో ఆయన భార్య సునీత కేజ్రీవాల్ ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గురించి తెలుసుకోవాలని నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం…

సునీతా కేజ్రీవాల్ 1994 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి. 22 సంవత్సరాలు ఆదాయపు పన్ను (IT) శాఖలో పనిచేశారు ఆమె.1995 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి అరవింద్ కేజ్రీవాల్ భోపాల్‌లో శిక్షణా కార్యక్రమంలో సునీతను కలిశారు. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2016లో సునీతా కేజ్రీవాల్ ఐటీ శాఖ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఆమె చివరిసారిగా ఢిల్లీలోని ఇన్ కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ)లో ఐటీ కమిషనర్ గా పనిచేశారు. సమాచారం మేరకు ఆమె జీవశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు.

We’re now on WhatsAppClick to Join.

సునీతా కేజ్రీవాల్ ‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమానికి 2011-2012లో ఆమె భర్త అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటులో మరియు ఆ పార్టీ తదుపరి ఎన్నికల ప్రచారాలలో కూడా సమగ్ర పాత్ర పోషించారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ వారణాసి నుండి ప్రధాని నరేంద్ర మోడీపై పోటీ చేసినప్పుడు సునీత తన కార్యాలయానికి లాంగ్ లీవ్ తీసుకొని ఆయన కోసం ప్రచారం చేసింది.

Also Read: Chandrababu: వాలంటీర్లకు నెలకు రూ.50 వేలు