Punjab BJP: బీజేపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. 400 సీట్లను టార్గెట్ పెట్టుకున్న కమలానికి ప్రజలు మద్దతు ఇవ్వలేదు. దీంతో బీజేపీ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ కూటమిలో టీడీపీ, జెడియు కీలక పాత్ర పోషించాయి. అయితే ఆ తర్వాత బీజేపీ(BJP)లో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడిన వైనం కనిపించింది. కాగా తాజాగా పంజాబ్ లోను బీజేపీకి షాక్ తగిలింది.
పంజాబ్ లో అక్టోబరు 15 న జరగనున్న పంచాయతీ ఎన్నికలకు ముందు రాష్ట్ర బీజేపీకి తలనొప్పి వచ్చి పడింది. వచ్చే పంచాయతీ ఎన్నికలకు పార్టీ వ్యూహంపై చర్చించి ఖరారు చేసేందుకు రాష్ట్ర బీజేపీ కీలక సమావేశానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్(Sunil Jakhar) హాజరు కాలేదు. పార్టీ పగ్గాలు తీసుకున్న ఏడాది తర్వాత సునీల్ జాఖర్ తన పదవికి రాజీనామా చేశారు.
పంజాబ్(Punjab) యూనిట్ అధ్యక్ష పదవికి సునీల్ జాఖర్ రాజీనామా చేయడంపై వచ్చిన పుకార్లను బీజేపీ ఖండించింది. అయితే ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రాష్ట్ర పరిస్థితులపై జాఖర్ కొంతకాలంగా కలత చెందుతున్నారని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడానికి ఇష్టపడటం లేదని ఇప్పటికే అగ్ర నాయకత్వానికి తెలియజేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తాను స్వేచ్ఛగా పని చేయలేనని చెప్పినట్లు సమాచారం. అయితే డిసెంబర్‌లో జరిగే తదుపరి ఎన్నికల వరకు పదవిలో కొనసాగాలని పార్టీ అతనికి సూచించింది.
రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యూహాన్ని ఖరారు చేయడానికి గురువారం జరిగిన సమావేశానికి గైర్హాజరు కావడంతో పార్టీతో ఆయనకున్న విభేదాల పుకార్లు బలపడ్డాయి. బిజెపి జూలై 2023లో కాంగ్రెస్ మాజీ నాయకుడు జాఖర్‌ను రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడిగా నియమించింది. పంజాబ్‌లోని సీనియర్ కాంగ్రెస్ నాయకులలో ఒకరైన జాఖర్ మే 2022లో బీజేపీలో చేరారు.
Also Read: Revanth Govt : మాది నిర్మాణం – మీది విధ్వంసం – కేటీఆర్ ట్వీట్