Bindeshwar Pathak : “సులభ్” విప్లవ యోధుడు బిందేశ్వర్ పాఠక్ ఇక లేరు

Bindeshwar Pathak :  మహా నగరాలు, సిటీలు, టౌన్లలో బహిరంగ మల,మూత్ర విసర్జన తగ్గడానికి ప్రధాన కారణం..  సులభ్ కాంప్లెక్స్ లు!! దేశ ప్రజల కోసం.. స్వచ్ఛ భారత్ కోసం .. "సులభ్" విప్లవం తీసుకొచ్చిన సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ ఇక లేరు..

Published By: HashtagU Telugu Desk
Bindeshwar Pathak

Bindeshwar Pathak

Bindeshwar Pathak :  మహా నగరాలు, సిటీలు, టౌన్లలో బహిరంగ మల,మూత్ర విసర్జన తగ్గడానికి ప్రధాన కారణం..  సులభ్ కాంప్లెక్స్ లు!! దేశ ప్రజల కోసం.. స్వచ్ఛ భారత్ కోసం .. “సులభ్” విప్లవం తీసుకొచ్చిన సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ ఇక లేరు.. ఆయన మంగళవారం (ఆగస్టు 15) ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కన్నుమూశారు.  గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా వైద్యులు కార్డియాక్ పల్మనరీ రిససిటేషన్ (CPR) సహాయంతో కృత్రిమశ్వాసను అందించడానికి ప్రయత్నించారు. అయినా బిందేశ్వర్ పాఠక్ ప్రాణాలు నిలువలేదు.

Also read : Rejected 13 Job Offers : ఆమె 13 జాబ్ ఆఫర్స్ కు నో చెప్పింది.. ఆ తర్వాత ఏమైందంటే ?

బిందేశ్వర్ పాఠక్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన(Bindeshwar Pathak)  మరణం దేశానికి తీరని లోటు అన్నారు. క్లీన్ ఇండియా నిర్మాణాన్ని జీవిత మిషన్‌గా మార్చుకున్నారని బిందేశ్వర్ పాఠక్ ను ప్రధాని కొనియాడారు. బీహార్ లోని వైశాలి జిల్లా రాంపూర్ బాఘేల్ గ్రామంలో బిందేశ్వర్ పాఠక్ జన్మించారు. దేశంలో పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ఆయన 1970లో సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ను స్థాపించారు. భారత ప్రభుత్వం ఆయనకు  పద్మభూషణ్ అవార్డును అందించింది. పారిశుధ్య రంగంలో బిందేశ్వర్ చేసిన కృషికి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి.

Also read : Indias First Prabal : మేడిన్ ఇండియా “ప్రబల్” రివాల్వర్‌.. ఆగస్టు 18 నుంచి బుకింగ్స్!

  Last Updated: 15 Aug 2023, 05:45 PM IST