Site icon HashtagU Telugu

Sukesh Writes Letter to Kejriwal : కేజ్రీవాల్ కు తీహార్ జైలు స్వాగతం పలుకుతుందంటూ సుఖేష్ లేఖ

Sukesh Chandrasekhar Writes

Sukesh Chandrasekhar Writes

ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Scam)లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Kejriwal) ను ఈడీ (ED) అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీ లో ఉన్నారు. ఇదిలా ఉండగా..మనీలాండరింగ్ కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) కేజ్రీవాల్ ను ఉద్దేశించి జైలు నుండి లేఖ రాసారు. తీహార్‌ క్లబ్‌కు బాస్‌గా మీకు స్వాగతం పలుకుతున్నా అంటూ లేఖలో పేర్కొన్నారు.

”ఆలస్యమైనా చివరకు నిజమే గెలుస్తుంది. సరికొత్త భారత్‌కు ఉన్న శక్తికి ఇదొక క్లాసిక్ ఉదాహరణ. తీహార్ క్లబ్‌కు మీకు స్వాగతం పలుకుతున్నా. ఖట్టర్ ఇమాన్దార్ అనే డ్రామాలకు ముగింపు పడింది. కేజ్రీవాల్ అవినీతి మొత్తం బహిర్గతం అవుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ మొత్తం 10 కుంభకోణాలు చేశారు. నాలుగు కుంభకోణాలకు నేనే సాక్షిగా ఉన్నాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రారంభం మాత్రమే. త్వరలోనే అప్రూవర్‌గా మారి నిజాలన్నీ బయటపెడతా’ అని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే కేసులో అరెస్ట్ అయినా కవిత ఫై కూడా సుఖేష్ లేఖ రాయడం జరిగింది. ‘లిక్కర్ కేసులో కవిత నేరం రుజువైంది. బూటకపు, రాజకీయ కేసులని ఆమె చేసిన వాదన అబద్ధమని తేలింది. నెయ్యి డబ్బాలంటూ ఆమె చెప్పిన కథలపై దర్యాప్తు జరుగుతుంది. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో BRS రూ.వేల కోట్లు దాచింది’ అని లేఖలో పేర్కొన్నాడు. అంతే కాదు త్వరలోనే తీహార్ జైల్లో కవిత ను కలుస్తా అంటూ లేఖ లో ప్రస్తావించడం మరింత కాకరేపుతుంది. ‘మా గ్రేటెస్ట్ తీహార్ జైలుకు మీకు స్వాగతం. మీ కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు. త్వరలోనే మిమ్మల్ని ఇక్కడ కలుస్తా. కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు, సీఎం కేజీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి. సినిమా క్లైమాక్స్కు చేరుకుంది’ అని లేఖలో పేర్కొన్నారు.

ఇక కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నేతలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. ఆప్ నేతలతోపాటు దేశంలోని ప్రతిపక్ష కూటమి ఇండియా నేతలు కూడా మోదీ సర్కార్ వైఖరి పట్ల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

Read Also :  ED Raids : కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు