Sudha Murty : రాజ్యసభకు నామినేట్‌ కావడంపై స్పందించిన సుధామూర్తి

  Sudha Murty : తనను రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్‌ చేయడం పట్ల ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (Sudha Murty) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi), రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu)కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ఈ అవకాశం కల్పించడం తనకు ఇచ్చిన పెద్ద బహుమతి అని.. దేశం కోసం పనిచేయడం […]

Published By: HashtagU Telugu Desk
Sudha Murthy Reacts On Bein

Sudha Murthy Reacts On Bein

 

Sudha Murty : తనను రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్‌ చేయడం పట్ల ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (Sudha Murty) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi), రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu)కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ఈ అవకాశం కల్పించడం తనకు ఇచ్చిన పెద్ద బహుమతి అని.. దేశం కోసం పనిచేయడం కొత్త బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu).. సుధామూర్తిని ఎగువ సభకు నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు సుధామూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ కావడం సంతోషకరమైన విషయమన్నారు. సామాజిక సేవలో సుధామూర్తిది స్ఫూర్తిదాయక ముద్ర అని కొనియాడారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్య సహా విభిన్న రంగాలకు సుధా జీ చేసిన కృషి అపారమైనదని ప్రశంసించారు. సుధామూర్తి లాంటి వ్యక్తి రాజ్యసభలో ఉండటం నారీ శక్తికి ఒక శక్తివంతమైన నిదర్శనం అని కొనియాడారు. ఈ నేపథ్యలో ప్రధాని మోడీకి సుధామూర్తి కృతజ్ఞతలు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, 73 ఏళ్ల సుధామూర్తి ప్రస్తుతం ‘మూర్తి ట్రస్ట్‌’కు ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. రచయిత్రిగా, విద్యావేత్తగా, మానవత్వవాదిగా సుధామూర్తి దేశవ్యాప్తంగా సుపరిచతమే. ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆమె పలు అనాథాశ్రయాలను నెలకొల్పారు. గ్రామీణాభివృద్ధికి, విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్‌, గ్రంథాలయ వసతులు కల్పించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్రం పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది.

read also : National Creators Award: నేషనల్ క్రియేటర్స్ అవార్డులను అందజేసిన ప్రధాని మోడీ

 

  Last Updated: 08 Mar 2024, 02:53 PM IST