Site icon HashtagU Telugu

8 People Burnt Alive : కదులుతున్న బస్సులో మంటలు.. 8 మంది సజీవ దహనం

8 People Burnt Alive

8 People Burnt Alive

8 People Burnt Alive : హర్యానాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కదులుతున్న టూరిస్టు బస్సులో మంటలు చెలరేగడంతో ఎనిమిది మంది సజీవ దహనమవగా, 24 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం అర్థరాత్రి 1.30 గంటలకు నుహ్​ జిల్లాలో చోటుచేసుకుంది.  ప్రమాదం జరిగిన టైంలో ఈ బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నారని.. వీరంతా మతపరమైన తీర్థయాత్రల కోసం బయలుదేరారని గుర్తించారు.

We’re now on WhatsApp. Click to Join

ఈ బస్సులో మంటలు చెలరేగగానే  అందులో ఉన్న ఓ వృద్ధురాలు బయటికి దూకి ప్రాణాలు కాపాడుకుంది. బస్సులో మంటలు చెలరేగిన విషయాన్ని గమనించకుండా డ్రైవర్ వాహనాన్ని చాలా దూరం నడిపాడని.. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి బస్సును ఓవర్ టేక్ మరీ ఈ విషయాన్ని డ్రైవరుకు చెప్పాడని సదరు వృద్ధురాలు మీడియాకు తెలిపింది.  ముందు సీటులో కూర్చొని ఉన్నందున.. నా దగ్గరికి మంటలు వచ్చేలోగా కిటికీలో నుంచి దూకి ప్రాణాలను కాపాడుకోగలిగానని ఆమె చెప్పింది. ‘‘ఆ బస్సులో ఉన్న చాలా మంది ప్రయాణికులు నా బంధువులే. వారు పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందినవారు. నేను పంజాబ్‌కు చెందిన లూథియానా వాస్తవ్యురాలి. 7-8 రోజుల తీర్థయాత్ర ముగించుకొని ఇళ్లకు తిరిగి వెళ్తుండగా ఇలా జరిగింది’’ అని సదరు వృద్ధురాలు వివరించింది.

Also Read :Mirai Manchu Manoj : మిరాయ్ నుంచి మంచు హీరో లుక్.. ప్రీ లుక్ పోస్టర్ షేక్ అయ్యేలా ఉంటే..!

బస్సు మంటల్లో కాలుతుండటాన్ని చూసి రోడ్డు పక్కన దుకాణం నడుపుతున్న మరో వ్యక్తి ఉరుకులు పరుగులతో వచ్చి.. బస్సులోని కిటికీలను పగలగొట్టి 5-10 మంది ప్రయాణికులను కాపాడాడు. మంటలు తీవ్రంగా చెలరేగుతుండటంతో అతడు అంతకంటే ఎక్కువ మందికి సాయం చేయలేకపోయాడు. బస్సుకు మంటలు అంటుకున్న దాదాపు 3 గంటల తర్వాత నాలుగు ఫైరింజన్లు వచ్చాయి. దీంతో అప్పటికే 8 మంది ప్రయాణికులు(8 People Burnt Alive) సజీవ దహనమయ్యారు. అయితే బస్సులో మంటలు ఎందుకు చెలరేగాయి అనేది తెలియాల్సి ఉంది.

Also Read :Nail Polish Benefits : పురుషులు నెయిల్ పాలిష్ వేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు..!