Site icon HashtagU Telugu

Big shock For Congress : లోక్ సభ బరిలో నుండి తప్పుకున్న కీలక అభ్యర్థి

Sucharita Mohanty

Sucharita Mohanty

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) నగారా నడుస్తుంది. రెండుసార్లు కేంద్రంలో విజయం సాధించిన బిజెపి మూడోసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ సైతం మూడో ఛాన్స్ బిజెపికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. బిజెపి ఫై విమర్శల వర్షం కురిపిస్తూనే..మరోపక్క రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ఫై ఫోకస్ పెడుతూ వస్తుంది. ఈసారి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ కు ఒడిశా లో భారీ షాక్ తగిలింది.

We’re now on WhatsApp. Click to Join.

ఒడిషా (Odisha)లోని పూరి నుంచి కాంగ్రెస్ తరపున లోక్‌సభ అభ్యర్థిగా దిగిన సుచరిత మహంతి (Sucharita Mohanty) పోటీ నుంచి తప్పుకుంది. ఈమె తప్పుకోవడం వెనుక ప్రధాన కారణం ఆర్ధిక నిధుల కొరతే అని తెలుస్తుంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసింది.ఎన్నికల ముందు ఇలా చేయడం కరెక్ట్ కాదని ఖర్గే, రాహుల్ వంటి నేతలు ధ్వజమెత్తారు. అయినప్పటికీ కేంద్రం తగ్గలేదు. ఇప్పుడు ఈ సమస్య తోనే లోక్ సభ బరిలో నిల్చున్న నేతలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎన్నికలు అంటేనే డబ్బుతో కూడుకున్నది. బరిలో నిల్చున్న అభ్యర్థులు 25 % సొంత డబ్బును ఖర్చు చేసిన మిగతా డబ్బు ఆయా పార్టీల అధిష్టానం నుండి రావాల్సిందే. ఇప్పుడు ఆ అధిష్టానం డబ్బులన్నీ సీజ్ కావడం తో బరిలో నిల్చున్న అభ్యర్థులు..అధికార పార్టీ అభ్యర్థులతో పోటీ పడి ఖర్చు చేయలేకపోతున్నారు. దీంతో ప్రజలు అధికార పార్టీ నేతల వైపే మొగ్గు చూపిస్తున్నారు.

సుచరిత మహంతి పరిస్థితి కూడా అలాగే అయ్యింది. పార్టీ నుంచి తనకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదన్నది ఆమె చెబుతున్నమాట. పార్టీ నిధులు లేకుండా ప్రచారం చేయడం తనకు సాధ్యంకాలేని మనసులోని మాట బయటపెట్టారు. ఈ క్రమంలో తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు‌గోపాల్‌కు సుచరిత ఈ మెయిల్ పంపారు. నిధులు లేని కారణంగా నియోజకవర్గంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయని, ఈ విషయాన్ని ఒడిషా యూనిట్ తెలిపానని సుచరిత మహంతి చెప్పుకొచ్చారు. అక్కడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పోటీ నుంచి తప్పుకుంటున్నాని, తాను సొంతంగా నిధులు సమకూర్చలేని పరిస్థితిలో ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పుడు అధిష్టానం ఏంచేస్తుందో చూడాలి.

Read Also : NTR : ఎన్టీఆర్ బర్త్ డేకి.. ఈ అప్డేట్స్ రాబోతున్నాయట.. సాంగ్, గ్లింప్స్, పోస్టర్..!