Site icon HashtagU Telugu

Students RAPE classmate: ముంబైలో దారుణం.. తరగతి గదిలో బాలికపై అత్యాచారం

Gang Raped

Gang Raped

ముంబై నగరంలోని పాఠశాల తరగతి గదిలో దారుణం జరిగింది. ముంబై రాష్ట్రంలోని మాతుంగా ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాల తరగతి గదిలో ఇద్దరు బాలురు తమ 13 ఏళ్ల క్లాస్‌మేట్‌పై అత్యాచారానికి పాల్పడ్డారు. మరాఠీ మీడియం సివిక్ స్కూల్ క్లాస్‌రూమ్‌లో మైనర్ బాలికపై ఆమె సహ విద్యార్థులు ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. యువకులిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ అధికారి విషయాలను వెల్లడించారు.

ఈ ఘటన సోమవారం జరిగినట్లు తెలిపారు. ” ఇతర క్లాస్‌మేట్స్ డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం క్లాస్ నుండి బయటకు వెళ్ళినప్పుడు బాలికపై ఇద్దరు విద్యార్థులు తరగతి గదిలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు” అని మాతుంగా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. పరిస్థితిని అవకాశంగా తీసుకుని నిందితులిద్దరూ ఈ నేరానికి పాల్పడ్డారు.

బాధితురాలు, నిందితులు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులని తెలిపారు. ఈ సంఘటనతో బాలిక షాక్ అయ్యింది. ఈ విషయాన్ని బాలిక తన కుటుంబ సభ్యులకు వివరించింది. వారు వెంటనే నిందితులపై ఫిర్యాదు చేశారని ఓ అధికారి తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులు బాలురపై ఐపీసీ సెక్షన్ 376 డిఎ, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. మైనర్ నిందితులను జువైనల్ కోర్టు ముందు హాజరుపరిచారు. వారు వారిని దక్షిణ ముంబైలోని డోంగ్రీలోని బాల్య నిర్బంధ కేంద్రానికి పంపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు.

 

 

Exit mobile version