AI Human Robot : యుద్ధభూమిలో శత్రువులను చూసిన వెంటనే మట్టుబెట్టే ఏఐ రోబో రెడీ అయింది. దీన్ని ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్(గిడా) ఇంజినీరింగ్ విద్యార్థులు తయారు చేశారు. బీసీఏ, బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న 8 మంది విద్యార్థులు ఎంతో రీసెర్చ్ చేసి ఈ రోబోను(AI Human Robot) రూపొందించారు. దేశ సైనికుల భద్రత కోసం దీన్ని తయారు చేశామని వారు తెలిపారు. ఈ ఏఐ రోబో బరువు 55 కిలోలు. 6.6 అంగుళాల పొడవు ఉంటుంది. దీని ఎడమ చేయిపై 18ఎంఎం ఎలక్ట్రానిక్ మెషీన్ గన్ ఉంటుంది.
ఈ రోబోను 2 కిలో మీటర్ల దూరం నుంచి సైనికులు రిమోట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. తనకు 2 కి.మీ పరిధిలో శత్రువులను ఈ రోబో మట్టుబెట్టగలదు. ఇది 360 డిగ్రీల్లో చుట్టూ తిరుగుతూ ఏఐ టెక్నాలజీ కెమెరాలతో శత్రువులను చూసి జల్లెడ పడుతుది. మెటల్, స్టీల్, ఫైబర్‌తో ఈ రోబోను రూపొందించారు. దీన్ని ఆటో, మాన్యువల్ మోడ్లలో అవసరానికి అనుగుణంగా ఆపరేట్ చేయొచ్చని విద్యార్థులు వివరించారు.
We’re now on WhatsApp. Click to Join
గోరఖ్‌పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (గిడా)లో ఉన్న ఇన్నోవేషన్ సెల్ సహకారంతో 8మంది విద్యార్థులు కలిసి ఈ రోబోను తీర్చిదిద్దారు. దేశ భద్రత కోసం తమ విద్యార్థులు ఈ రోబోను తయారు చేశారని గిడా డైరెక్టర్ డాక్టర్ ఎన్కే సింగ్ వెల్లడించారు.ఈ రోబో తయారీలో గేర్ మోటార్ ఆర్మ్స్, హై పవర్ గేర్ మోటార్, మెటల్ పైపు, కెమెరా, సర్వో మోటార్లు, ఆర్ ఎఫ్ రిమోట్ కంట్రోల్, 12 వోల్ట్ బ్యాటరీ, మోటార్ సైకిల్ విడిభాగాలు తదితర పరికరాలను ఉపయోగించా మన్నారు.దీని తయారీకి ఆరు నెలల సమయం పట్టిందని తెలిపారు. రోబో మేకింగ్ కోసం రూ.1.80 లక్షలు ఖర్చయిందని వివరించారు. ‘‘మా విద్యార్థులు తయారు చేసిన రోబోలను దేశ సరిహద్దుల్లో నిర్మించిన బంకర్లలో మోహరించవచ్చు. రోబోలో అమర్చిన సెన్సార్లు సరిహద్దులో శత్రువుల రాకకు సంబంధించిన సమాచారాన్ని కంట్రోల్ రూమ్‌కు పంపిస్తుంటాయి. ఈ సమాచారం ఆధారంగా రిమోట్ కంట్రోల్‌తో రోబోను ఆపరేట్ చేయొచ్చు. దానితో శత్రువులపై దాడి చేయించవచ్చు’’ అని డాక్టర్ ఎన్కే సింగ్ వివరించారు.