Site icon HashtagU Telugu

T20 World Cup : టీ 20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఓటమితో… ఓ కళాశాలలో విద్యార్థుల మధ్య రాళ్ల దాడి..!!

Punjab

Punjab

ఆదివారం ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా జరిగిన పాకిస్తాన్, ఇంగ్లండ్ మ్యాచ్ ఉత్కంఠ రేపింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో పంజాబ్ లోని మోగాలో కళాశాల విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు పాల్పడ్డారు. పాకిస్తాన్ ఓటమి కారణంగా ఈ వివాదం చోటుచేసుకుంది. విద్యార్థులు ఇటుకలు, రాళ్లతో పరస్పరం దాడికి దిగారు. మెగా జిల్లాలోని ఎల్ఎల్ఆర్ఎం కళాశాలలో ఈ ఘటన జరిగింది.పాకిస్థాన్ జిందాబాద్-హిందుస్థాన్ ముర్దాబాద్ నినాదాలు చేస్తూ విద్యార్థులు రచ్చ రచ్చ చేశారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాల విద్యార్థులను చెదరగొట్టారు. వారి భవిష్యత్తును ద్రుష్టిలో ఉంచుకుని పోలీసులు వారికి అవగాహన కల్పించారు. మరోసారి ఇలాంటి చర్యలు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆదివారం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మ్యాచ్ ముగియకముందే విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. గాయపడిన విద్యార్థులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాకిస్తాన్ ఓడిపోయిందన్న అక్కసుతోనే కొంతమంది విద్యార్థులు దాడికి పాల్పడినట్లు సమాచారం.