Site icon HashtagU Telugu

IIT Roorkee: క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ లో ఓ విద్యార్థికి రూ. 1.3 కోట్ల వేతనం

Cropped

Cropped

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ 2022-23 విద్యా సంవత్సరానికి గాను గురువారం క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ను ప్రారంభించింది. ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్‌లు (PPOలు) సహా మొత్తం 365 ఆఫర్‌లు, ఆరు అంతర్జాతీయ ఆఫర్లు ఈ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ లో వచ్చాయి. ఈ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ లో ఓవరాల్ గా అత్యధికంగా ఓ విద్యార్థి రూ.1.30 కోట్ల వార్షిక వేతనం ఆఫర్ అందుకోగా.. అంతర్జాతీయంగా ఓ విద్యార్థికి రూ.1.06 కోట్లకు ఆఫర్ వచ్చింది. మొత్తంగా 10 మంది విద్యార్థులకు రూ.80 లక్షల వార్షిక ఆఫర్లు వచ్చాయి.

ప్లేస్‌మెంట్స్ కోసం మొత్తం 31 కంపెనీలు వచ్చాయి. AppDynamics, బజాజ్ ఆటో, BCG, కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్, డా విన్సీ డెరివేటివ్స్, ఫ్లిప్‌కార్ట్, గ్రావిటన్, హిలాబ్స్, ఇన్‌ఫర్నియా, ఇంటెల్ టెక్నాలజీస్, JP మోర్గాన్ క్వాంట్, మావెరిక్ డెరివేటివ్స్, మైక్రోసాఫ్ట్, NHA, NK సెక్యూరిటీస్, Nvidia, ONGC, Plutus Research Pvt Ltd, Qualcomm, QuantBox, SAP ల్యాబ్స్, Schlumberger, Sprinklr, Squarepoint, STMicroelectronics, టాటా స్టీల్, Texas Instrument, Trilogy, ఉబర్ కంపెనీలు ప్లేస్‌మెంట్స్ ఇవ్వటం కోసం వచ్చాయి. ఐఐటీ మద్రాస్, ఐఐటీ గౌహతి కూడా తమ క్యాంపస్ ప్లేస్‌మెంట్లను గురువారం ప్రారంభించాయి.