Delhi Earthquake : దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున 5:36 గంటలకు భూకంపం వచ్చింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కనిపించింది. ఆయాచోట్ల జనం అకస్మాత్తుగా నిద్ర నుంచి మేల్కొని.. ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. కొన్ని గంటల పాటు రోడ్లపైనే నిలబడిపోయారు. ఏదో విరిగిపోతున్నట్లు తమకు శబ్దం వినిపించిందని జనం చెప్పారు. ఢిల్లీ, నోయిడా, ఇందిరాపురం, గురుగ్రామ్ తదితర ఎన్సీఆర్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు వెల్లడైంది. ఈ భూకంపంలో(Delhi Earthquake) ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిసింది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో, రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. మరోవైపు బిహార్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చింది. ఈరోజు ఉదయం 8.02 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సివాన్‌లో 10 కిలోమీటర్ల లోతలో భూకంప కేంద్రం ఉందని గుర్తించారు. ప్రాణ, ఆస్తినష్టం వివరాలు తెలియరాలేదు.
Also Read :Guillain-Barré Syndrome (GBS) : ఏపీలో ఫస్ట్ మరణం
ప్రముఖుల ట్వీట్లు..
- “భూప్రకంపనలు వచ్చాయా? ఇది భూకంపమా?” అని ప్రశ్నిస్తూ బీజేపీ నేత తజిందర్ బగ్గా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. చాలామంది నెటిజన్లు దీనికి సమాధానం ఇచ్చారు.
- “బలమైన భూకంపం! ఓహ్” అంటూ బీజేపీ నేత షెహ్జాద్ పూనావాలా ఒక పోస్ట్ చేశారు.
- ‘‘నా అలారం మేల్కొల్పకపోయినా. భూకంపం మాత్రం మేల్కొల్పింది. నా ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగెత్తాను’’ అంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేశారు.
- “నేను ఇలాంటి భూకంపాన్ని ఎన్నడూ ఫీల్ కాలేదు. ఇన్సేన్!” అని ఒకరు ట్వీట్ చేశారు.
- “భూకంపం కొన్ని సెకన్ల పాటు కంటిన్యూ అయింది. మా సొసైటీ మొత్తం నిద్రలేచి రోడ్డుపైకి పరుగులు తీసింది” అని మరొకరు ట్వీట్ చేశారు.
Also Read :Bodhan Town : ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై సీఐ దౌర్జన్యం
భూకంపాలకు కారణాలు ఇవీ..
- భూమిలో నాలుగు పొరలు ఉంటాయి. అవి.. ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మాంటిల్, క్రస్ట్.
- భూమిలోని క్రస్ట్, ఎగువ మాంటిల్ కోర్ పొరలను కలిపి లిథోస్పియర్ అంటారు. 50 కి.మీ మందంతో ఉన్న ఈ పొర అనేక భాగాలుగా విభజితమై ఉంటుంది. ఈ భాగాలనే టెక్టోనిక్ ప్లేట్లు అంటారు.
- భూమి లోపల ఇలాంటి ఏడు టెక్టోనిక్ ప్లేట్లు ఉన్నాయి. అవి తిరుగుతూ ఉంటాయి.
- టెక్టోనిక్ ప్లేట్లు చాలా బలంగా కదిలినప్పుడు భూప్రకంపనలు వస్తాయి.
- భూకంపాల తీవ్రతను రిక్టర్ స్కేల్‌తో కొలుస్తారు. దీన్ని రిక్టర్ మాగ్నిట్యూడ్ టెస్ట్ స్కేల్ అంటారు.
- భూకంపం సంభవించినప్పుడు ఆభూమి లోపలి నుంచి విడుదలయ్యే శక్తి తీవ్రతనే.. భూకంప తీవ్రత అని పిలుస్తారు.
- భూగర్భ శక్తి విడుదలయ్యే ప్రదేశానికి కొంచెం దిగువన భూకంప కేంద్రం ఉంటుంది.
- రిక్టర్ స్కేల్‌పై 7 లేదా అంతకంటే ఎక్కువ భూకంప తీవ్రత నమోదైతే దాన్ని భారీ భూకంపంగా చెబుతారు.