Hardeep Singh Puri : మోడీ సర్కార్(Modi Govt)పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి(Union Minister Hardeep Singh Puri) తోసిపుచ్చారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాహుల్‌పై కఠిన చర్యలు చేపట్టాలని హర్దీప్ సింగ్ సోమవారం ఈసీ(EC)కి విజ్ఞప్తి చేశారు. రాహుల్‌కు కేవలం నోటీసులు జారీ చేస్తే సరిపోదని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ రాంలీలా మైదానంలో జరిగిన విపక్ష ఇండియా కూటమి ర్యాలీలో రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరకర అంశాలను ప్రస్తావించారని అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
బీజేపీకి ఈ ఎన్నికలు మ్యాచ్ ఫిక్సింగ్ అని, ఈసీలో ప్రభుత్వం సొంత మనుషులున్నారని, మోడీ ఈవీఎంలు లేకుండా గెలవలేరని పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. తాము ఈ విషయాలన్నింటినీ ఈసీ దృష్టికి తీసుకువచ్చామని, ఈ ఆరోపణలను ఈసీ తోసిపుచ్చిందని, వీటన్నింటికి సరైన ఆధారాలు లేవని పేర్కొందని చెప్పారు.
Read Also: AP Volunteers: వైసీపీకి ఈసీ బిగ్ షాక్, తిరుపతిలో 11 మంది వాలంటీర్ల తొలగింపు
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్ర పాలకులు లాగేసుకున్నారని రాహుల్ ఆరోపించారని, కాషాయ పార్టీకి 400 సీట్లు దక్కితే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ఓ బీజేపీ కార్యకర్త చెప్పారని రాహుల్ అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. అలా అని ఏ కార్యకర్త చెప్పాడో తమకు తెలియదని అన్నారు. ఇండియా విపక్ష కూటమి చీలిపోతోందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి కేవలం నోటీసు జారీ చేస్తే సరిపోదని, ఆయనపై కఠిన చర్యలు చేపట్టాలని హద్దీప్ పూరి డిమాండ్ చేశారు.