భార‌త క్రికెట్ దేవుడు స‌చిన్ భాగోతం

ఇండియా దాటిన బ్లాక్ మ‌నీ తీసుకొస్తాన‌ని ప్ర‌జ‌ల‌క ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన మొద‌టి ప్ర‌మాణం. కొన్ని ల‌క్ష‌ల కోట్ల అ వినీతి సొమ్మును రాబ‌డ‌తార‌ని మోడీపై ఇప్ప‌టికీ విశ్వాసం ఉంచిన క‌షాయం ద‌ళం ఉంది. వికీ లీక్స్ దేశం దాటి వెళ్లిన డ‌బ్బుల వ్య‌వ‌హారం, స్విస్ లోని భార‌తీయు జాబితాను కూడా బ‌య‌ట‌పెట్టింది. కానీ, చ‌ర్య‌లు శూన్యం.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:26 PM IST

ఇండియా దాటిన బ్లాక్ మ‌నీ తీసుకొస్తాన‌ని ప్ర‌జ‌ల‌క ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన మొద‌టి ప్ర‌మాణం. కొన్ని ల‌క్ష‌ల కోట్ల అ వినీతి సొమ్మును రాబ‌డ‌తార‌ని మోడీపై ఇప్ప‌టికీ విశ్వాసం ఉంచిన క‌షాయం ద‌ళం ఉంది. వికీ లీక్స్ దేశం దాటి వెళ్లిన డ‌బ్బుల వ్య‌వ‌హారం, స్విస్ లోని భార‌తీయు జాబితాను కూడా బ‌య‌ట‌పెట్టింది. కానీ, చ‌ర్య‌లు శూన్యం.

ఇప్పుడు మ‌ళ్లీ వికీలీక్స్ మాదిరిగా పండోరా పేప‌ర్స్ లోని పేర్లు లీక్ అయ్యాయి. వాటిలో ప్ర‌ధానంగా భార‌త‌ క్రికెట్‌ దేవుడు స‌చిన్ పేరు ఉండ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. భారీ ఎత్తున సూట్ కేస్ కంపెనీలు, స్వ‌చ్చంధ‌ల ద్వారా అన‌‌ధికార లావాదేవీల చేసిన‌ వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు అయింది. భార‌త క్రికెట్ మాజీ కెప్ట‌న్, కాంగ్రెస్ మాజీ ఎంపీ స‌చిన్ పేరు పండోర పేప‌ర్స్ ఉండ‌డం హాట్ టాపిక్ అయంది. ఈ లీవ్ జాబితాలో ప్ర‌పంచంలోని ప‌లువురు సెల‌బ్రిటీస్, పారిశ్రామిక‌వేత్త‌లు, రాజ‌కీయ‌వేత్త‌లు ఉన్నారు.
సుమారు 14 ఆర్థిక సంస్థ‌ల నుంచి సేక‌రించిన 11.9 మిలియ‌న్ డాక్యుమెంట్ల‌ను 600 మంది ఇంటర్నేష‌న‌ల్ జ‌ర్న‌లిస్ట్ లు పండోరా పేప‌ర్స్ అధ్య‌‌య‌నం చేశారు. ఇంట‌ర్నేష‌న‌ల్ క‌న్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ జ‌ర్న‌లిస్ట్స్ (ఐ సీఐజె) గా 600 మంది జ‌ర్న‌లిస్ట్ ఏర్ప‌డ్డారు. వాళ్లు 11.9 మిలియ‌న్ డాక్యుమెంట్ల‌ను ప‌రిశీలించారు. ఈ టీంలోని బీబీసీ, గార్డియ‌న్ జ‌ర్న‌లిస్ట్ లు చేసిన ప‌రిశోధ‌న‌లో ప‌లువురు ప్ర‌పంచంలోని ప్ర‌ముఖ రాజ‌కీయ‌వేత్త‌లు, ప‌వ‌ర్ లీడ‌ర్ల బాగోతాన్ని బ‌య‌ట‌పెట్టారు.

స‌చిన్, పాప్ సింగ‌ర్ ష‌కీరా, మోడ‌ల్ క్లాడియాచిఫ‌ర్‌, ఇటాలియ‌న్ మాబ్ స్ట‌ర్ త‌దిత‌ర పేర్ల‌ను వెల్ల‌డించారు. క్రికెట్ ఆట‌గాళ్ల‌లో అంద‌రి కంటే ఎక్క‌వ ఫీజుల రూపంలో టెండూల్క‌ర్ తీసుకుంటాడు. అన్ని ఫార్మాట్ల‌లోనూ ఎక్కువ వేత‌నం టెండూల్క‌ర్ కు ఉంది. మాజీ క్రికెట‌ర్ టెండూ ల్క‌ర్ లావాదేవీల‌న్నీ సరైన‌వేన‌ని ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాది చెబుతున్నారు. ఆదాయ ప‌న్నుల శాఖ ఆ మేర‌కు క్రికెట‌ర్ల అంద‌రి ఆదాయం స‌క్ర‌మ‌మేన‌ని వెల్ల‌డించిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేస్తున్నారు. ఎలాంటి ప్రైవేటు వ్య‌వ‌హారాలు ప‌న్ను చెల్లింపు విష‌యంలో జ‌ర‌గ‌లేద‌ని సింగ‌ర్ ష‌కీరాస్ న్యాయ‌వాది చెబుతున్నారు. ప్ర‌స్తుతం యూకేలో ప‌న్నులు చెల్లిస్తున్న‌ట్టు చిఫ‌ర్స్ వ్య‌క్తిగ‌త ప్ర‌తినిధులు వివ‌రిస్తున్నారు.

పాకిస్తాన్ ప్ర‌ధాని, మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ బినామీ పేర్ల‌తో కంపెనీలు, స్వ‌చ్చంధ సంస్థ‌ల‌ను క‌లిగి ఉన్నార‌ని ఐసీఐజె తేల్చింది. ప‌రిశోధ‌న‌లో తేలిన విధంగా ఎవ‌రైనా పాకిస్తాన్ పౌరులు త‌ప్పులు చేసుంటే, త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఖాన్ వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గాల‌ని ఖాన్ అభిప్రాయ‌ప‌డ్డారు. ప‌న్నుల ఎగ‌వేత‌దారులు, మ‌నీల్యాండ‌రింగ్‌, అవినీతి త‌దిత‌ర రూపాల్లో డ‌బ్బు పోగుచేసిన వాళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.