Site icon HashtagU Telugu

Lok sabha elections : కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం షాక్..

Stop Sending 'viksit Bharat

Stop Sending 'viksit Bharat

 

Lok sabha elections: సోషల్‌ మీడియా ద్వారా చేస్తున్న ‘వికసిత్‌ భారత్‌’ ప్రచారాన్ని (Viksit Bharat messages) వెంటనే నిలిపివేయాలని కేంద్రాన్ని ఎన్నికల సంఘం (Election Commission) ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Union Ministry of Electronics and Information Technology)కు గురువారం ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో.. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం వాట్సాప్ ద్వారా వికసిత్ భారత్ సందేశాలను పంపించడాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.

We’re now on WhatsApp. Click to Join.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌ కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ పదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను, భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూ ‘వికసిత్ భారత్’ క్యాంపెయిన్‌ను వివిధ ప్రచార, ప్రసార మాధ్యమాల్లో కేంద్ర ప్రభుత్వంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వాట్సాప్‌ (WhatsApp) ద్వారా కూడా ప్రజలకు మెసేజ్‌లు పంపుతోంది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటికీ ఈ మెసేజ్‌లు వెళ్తుండటంతో.. పలు పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్‌ వెంటనే చర్యలు చేపట్టింది. ‘వికసిత్‌ భారత్‌’ ప్రచారాన్ని వెంటనే ఆపాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

read also: Predicted All IPL Teams: ఐపీఎల్‌లో ఆడే ప‌ది జ‌ట్ల ఆట‌గాళ్ల అంచ‌నా ఇదే..!