Site icon HashtagU Telugu

Stones Thrown : శ్రీరాముడి శోభాయాత్ర పై రాళ్ల దాడి

Stone Attack On Sri Ram's S

Stone Attack On Sri Ram's S

బాలరాముడి రూపంలో రేపు అయోధ్య (Ayodhya) ఆలయంలో వైభవంగా కొలువుదీరనున్నాడు. దీంతో దేశంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాలు రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ధర్మానికి, కరుణకు, కర్తవ్యానికి ప్రతిరూపమైన రాముడు ఆలయంలో కొలువుదీరే వేళ.. రామ భక్తులంతా కొన్ని రామనామాలను జపించాలని పండితులు సూచిస్తున్నారు. దీనివల్ల భయాలు, కష్టాలు తీరతాయని వారు చెబుతున్నారు.

సోమవారం ( జనవరి 22) మధ్యాహ్నం 12.29కి అభిజిత్‌ లగ్నంలో ప్రధాని మోడీ (PM Modi) చేతుల మీదుగా బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు బాల రామయ్య విగ్రహానికి 114 కలశాల నీటిని ఉపయోగించి ఉత్సవ స్నానం చేయించనున్నారు. అనంతరం మహాపూజ, ప్రసాదంలో పరిక్రమ, శయ్యాధివాస్, తత్లాన్యాలు, మహన్యాలు ఆదిన్యాలు, అఘోర్ హోమం, వ్యాహతి హోమం, సాయంత్రం పూజ, ఆరతి ఉంటాయని అంతేకాదు రాత్రి జాగరణ ఉండనుంది. ఇంత మహత్తర కార్యక్రమం జరగనున్న తరుణంలో గుజరాత్ (Gujarat) లోని మోహసానా జిల్లాలో శ్రీరాముడి శోభాయాత్ర (Sri Ram Shobha Yatra )పై రాళ్లు రువ్వడం (Stones Thrown) కలకలం రేపింది.

We’re now on WhatsApp. Click to Join.

పట్టణంలోని బెలిమ్ వాస్‌లోని హటాడియా ప్రాంతానికి ఊరేగింపు రాగానే రాళ్ల దాడి జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు మూడు రౌండ్లు టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు ఐజీ వీరేంద్ర సింగ్ యాదవ్ తెలిపారు. ఘటన తర్వాత ఈ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి 15 మందిని పట్టుకున్నారు. పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఐజీ వెల్లడించారు. ఈ దాడిలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని, పోలీస్ పెట్రోలింగ్ పెంచినట్లు తెలిపారు.

Read Also : Face Mask Mistakes: మీరు కూడా ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నారా.. అయితే ఈ 4 తప్పులు అస్సలు చేయకండి?