Stock Market 75000 : స్టాక్ మార్కెట్ రయ్ రయ్.. తొలిసారిగా 75000 దాటిన సెన్సెక్స్

Stock Market 75000 : భారత స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్ నడుస్తోంది.

  • Written By:
  • Updated On - April 9, 2024 / 02:13 PM IST

Stock Market 75000 : భారత స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్ నడుస్తోంది. ఇవాళ స్టాక్ మార్కెట్ సూచీలన్నీ గ్రీన్‌లో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో బీఎస్‌ఈ 30 షేర్ల సెన్సెక్స్ తొలిసారిగా 75,000 మార్క్‌ను(Stock Market 75000) దాటింది.  ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 75,124.28 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ కూడా 22,700 స్థాయిని దాటి, కొత్త గరిష్టానికి చేరింది. మార్చి 6న 74,000 మార్క్‌ను తాకిన సెన్సెక్స్ కేవలం 24 సెషన్లలోనే మరో 1000 పాయింట్లు పెరగడం విశేషం. 70,000 నుంచి 75,000కు చేరడానికి దాదాపు నాలుగు నెలల టైం పట్టింది. మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ చరిత్రలోనే తొలిసారిగా సోమవారం రూ.400 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది.

We’re now on WhatsApp. Click to Join

టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి కీలక షేర్లు రాణిస్తుండడం సెన్సెక్స్‌-30 సూచీలో ఉత్సాహం నింపింది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఏకంగా 99 పాయింట్లు పెరిగి 22,765.30 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌తో సహా అన్ని రంగాల్లో కొనుగోళ్లు జోరుగా సాగడంతో మార్కెట్ లాభాల్లో కొనసాగుతుంది.అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు రాణిస్తుండడం విశేషం.

Also Read : Z Category Security: ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు ‘జెడ్’ కేట‌గిరీ భ‌ద్ర‌త‌.. కార‌ణ‌మిదే..?

సెన్సెక్స్‌ కీలక మైలురాళ్లు

మైలురాయి (పాయింట్లు)    – సంవత్సరం

1000          –   1990 జులై

5000    – 1999 అక్టోబరు

10,000 –  2006 ఫిబ్రవరి

20,000 – 2007 డిసెంబరు

30,000 – 2017 ఏప్రిల్

40,000 – 2019 జూన్

50, 000 – 2021 ఫిబ్రవరి

60,000 – 2021 సెప్టెంబరు

70,000 – 2023 డిసెంబరు

75,000 – 2024 ఏప్రిల్ 

Also Read : Kavithas Letter : నేను బాధితురాలిని.. నాకు వ్యతిరేకంగా ఆధారాల్లేవ్.. కవిత సంచలన లేఖ