LIC IPO : ఎల్ఐసీ షేర్లు పడ్డాయి.. అయినా సరే కొనుక్కోవచ్చా?

ఎంతో ఆశగా ఎదురుచూసిన ఎల్ఐసీ లిస్టింగ్ ఇన్వెస్టర్లను ఉసూరుమనిపించింది.

  • Written By:
  • Publish Date - May 18, 2022 / 12:36 PM IST

ఎంతో ఆశగా ఎదురుచూసిన ఎల్ఐసీ లిస్టింగ్ ఇన్వెస్టర్లను ఉసూరుమనిపించింది. భారీ లాభాలు తెచ్చిపెడుతుందనుకుంటే తొలి రోజే నష్టాలు మూటగట్టి ఇచ్చింది. ఎల్ఐసీ షేర్లలో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు ఒక్కరోజులోనే 42వేల కోట్ల రూపాయల వరకు కోల్పోయారు. మరి ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఏం చేయాలి? అమ్ముకోవాలా లేక ధైర్యం చేసి కొనుక్కోవాలా? దీనికి సమాధానం తెలియాలంటే.. ముందు
ఎల్ఐసీ షేర్లు ఎందుకు పడ్డాయో అర్థం చేసుకోవాలి. నిజానికి కేంద్రం భయపడినట్టే జరిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఎల్ఐసీ ఐపీఓను ఇప్పుడప్పుడే వద్దనుకుంది. ఆ తరువాత ఎందుకనో
ధైర్యం చేసింది. కాకపోతే ఐదుశాతం వాటా బదులు 3.5 శాతం వాటానే అమ్మకానికి పెట్టింది. అయినా సరే ఎక్కడో భయం ఉండిపోయింది. ఆ భయమే నిజమైంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ కండీషన్లు
అస్సలు బాగోలేవు. ఇండియా అనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. విదేశీ సంస్థాగత పెట్టుబడి దారులు కొన్ని నెలలుగా ఇండియన్ మార్కెట్ల నుంచి వెళ్లిపోతున్నారు తప్ప.. తిరిగి రావడం లేదు.
పైగా అమెరికా తిరిగి మాంద్యంలోకి వెళ్లిపోబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెగటివ్ సెంటిమెంట్ మొత్తం ఎల్ఐసీ షేరుపై పడింది. అందుకే, తొలి రోజే ఈ షేరు నష్టాలతో ముగిసింది.

మరి ఎల్ఐసీ షేరును కొనుక్కోవచ్చా? మార్కెట్ నిపుణులు చెబుతున్నదైతే.. ఈ షేరును కేవలం ఒక్కరోజు పెట్టుబడిగా చూడొద్దని. దీర్ఘకాలంలో ఎల్ఐసీ షేరు బ్రహ్మాండమైన రాబడి ఇస్తుందని
నమ్ముతున్నారు. షేర్ పడడం ఒక విధంగా మంచిదే. ఐపీఓలో దరఖాస్తు చేయలేని వారికి, అలాట్‌మెంట్ రాని వాళ్లకి ఇదొక సువర్ణావకాశం. ఎల్ఐసీ షేరు రెండో రోజు కూడా పడిపోతుంటే.. చూసి
భయపడాల్సిన అవసరం లేదు. ఎల్ఐసీ షేర్లు ఎన్నుంటే అంత లాభం ఖాతాలో పడినట్లేననేది ఎక్స్‌పర్ట్స్ మాట.