కాంగ్రెస్ ట‌ర్మాయిల్ పాలిటిక్స్.. సిబాల్ వ్యాఖ్య‌ల క‌ల‌క‌లం, గాంధీల‌పై న‌క్వీ గ‌డుసుత‌నం

గాంధీ కుటుంబానికి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ సీనియ‌ర్లు మ‌ళ్లీ కూట‌మి క‌డుతున్నారా? పంజాబ్ సంక్షోభం మ‌రోసారి సోనియాగాంధీని ఇర‌కాటంలో పెట్టేలా ఉందా? ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ లో ఏం జ‌రుగుతోంది?

  • Written By:
  • Publish Date - October 5, 2021 / 11:13 AM IST

గాంధీ కుటుంబానికి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ సీనియ‌ర్లు మ‌ళ్లీ కూట‌మి క‌డుతున్నారా? పంజాబ్ సంక్షోభం మ‌రోసారి సోనియాగాంధీని ఇర‌కాటంలో పెట్టేలా ఉందా? ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ లో ఏం జ‌రుగుతోంది? కేంద్ర మంత్రి , బీజేపీ సీనియ‌ర్ లీడ‌ర్ ముక్తార్ అబ్బాస్ న‌క్కీ చెప్పిన‌ట్టు నిర‌ర్థ‌క ఆస్తి కింద కాంగ్రెస్ పార్టీని చూడాల్సిందేనా…అంటే తాజా ప‌రిణామాలు ఆ పార్టీ సంక్షోభాన్ని మ‌రింత పెంచుతున్నాయి. ప్ర‌తిప‌క్ష పార్టీలోని లుక‌లుక‌ల‌ను అధికార పార్టీ అనుకూలంగా మ‌లుచుకుంటోంది. న‌క్వీ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు కాంగ్రెస్ పార్టీలోని పొలిటిక‌ల్ ట‌ర్మాయిల్ మోతాదును తెలియ‌చేస్తున్నాయి.
పంజాబ్ సంక్షోభంపై తొలుత కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్ క‌పిల్ సిబాల్ స్పందించారు. ఆయ‌న వెంట సీనియ‌ర్లు భూపేంద్ర‌సింగ్, వివేక్ త‌న్హా, రాజ్ బ‌బ్బ‌ర్, గులాంన‌బీ ఆజాద్, ఆనంద్ శ‌ర్మ త‌దిత‌రులు వాయిస్ ను జోడించారు. దీంతో సోనియా గాంధీ నాయ‌క‌త్వాన్ని త‌ప్పుబ‌ట్టిన 25 మంది సీనియ‌ర్లు మ‌ళ్లీ గ‌ళం విప్ప‌డానికి సిద్ధం అయ్యార‌ని తెలుస్తోంది. గ‌తంలో సోనియాగాంధీ లీడ‌ర్ షిప్ ను త‌ప్పుబ‌డుతూ కాంగ్రెస్. వ‌ర్కింగ్ క‌మిటీలోనే 25 మంది సీనియ‌ర్లు లేఖ‌లు రాయ‌డం అంద‌రికీ తెలిసిందే. ఆ స‌మ‌యంలో పార్టీని సంక్షోభం నుంచి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌క‌పోగా, సోనియా నిమ్మ‌కుండిపోయారు. మ‌రోవైపు రాహుల్ గాంధీ పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు తీసుకోవ‌డానికి ఇష్టంగా లేరు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీకి ర‌థ‌సార‌ధి ఎవ‌రు అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతుంది. ప్ర‌స్తుతానికి సోనియాగాంధీ సార‌థ్యం వ‌హిస్తున్న‌ప్ప‌టికీ గ‌తంలో మాదిరిగా ఆమె చురుగ్గా లేరు. అనారోగ్యం ఆమెను వెంటాడుతోంది. ఈనేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీని ఒక పాత పార్టీగా బీజేపీ నేత న‌క్వీ అభివ‌ర్ణించ‌డం ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది.
నెహ్రూ కుటుంబ పార్టీగా కాంగ్రెస్ పార్టీని న‌క్వీ ఆరోపించారు. పాతప‌డిపోయిన ఆ పార్టీ పంజాబ్ లో పొలిటిక‌ల్ ట‌ర్మాయిల్ ను పూసుకుంద‌ని వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. ఒక వైపు సునామీ లాంటి రాజ‌కీయ సంక్షోభంలో కాంగ్రెస్ చిక్కుకోగా ఇంకో వైపు అస‌హ‌నంతో ఉన్న ప్యూడ‌ల్ కుటుంబం చేతిలో ఇరుక్కుపోయింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌స్తుతం అధికార పార్టీకి బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం కావాల‌ని కేంద్రం మంత్రి న‌క్వీ అన్నారు. తిక‌మ‌క, భిన్న‌వాద‌న‌ల‌తో ఉన్న ప్ర‌తిప‌క్షం ఉంద‌ని విమ‌ర్శించారు. పాత‌ప‌డిపోయిన కాంగ్రెస్ పార్టీ నానాటికీ దిగ‌జారిపోతోంద‌ని న‌క్వీ విమ‌ర్శ‌నాస్త్రాల‌ను సంధించారు. వాటికి బ‌లం చేకూరేలా క‌పిల్ సిబాల్ వ్యాఖ్య‌ల‌ను జోడించారు బీజేపీ న‌క్వీ. ఫలితంగా కాంగ్రెస్ ట‌ర్మాయిల్ పాలిటిక్స్ దేశ వ్యాప్తంగా హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వీటికి సోనియా, రాహుల్ ఎలా ఫుల్ స్టాప్ పెడ‌తారో..చూద్దాం.