Site icon HashtagU Telugu

PM Credit Scheme : తెలంగాణ భేష్‌..ఏపీ బ్యాడ్.!

Street Business

Street Business

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన `మైక్రో క్రెడిట్ స్కీమ్‌` ను ఉప‌యోగించుకోవ‌డంలో తెలంగాణ కంటే ఏపీ దారుణంగా వెనుక బ‌డింది. ఆ ప‌థ‌కం కింద 70శాతం మంజూరును తెలంగాణ క‌లిగి ఉంది. అదే, ఏపీ రాష్ట్రం కేవ‌లం 50శాతం మంజూరును కూడా పొంద‌లేక‌పోయింది. రుణాల మంజూరులోనూ, ద‌ర‌ఖాస్తు చేయ‌డంలోనూ తెలంగాణ కంటే ఏపీ బాగా వెనుక‌బ‌డిందిచ. కేంద్ర ప‌థ‌కాన్ని వినియోగించుకోవ‌డంలో ఏపీ వైఫ‌ల్యం చెందింది. వీధి వ్యాపారుల కోసం కేంద్రం మైక్రో క్రెడిట్ స్కీమ్ ను `పీఎం స్వనిధి` పేరుతో ప‌రిచ‌యం చేసింది. ఈ ప‌థ‌కం గురించి అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి ప్రత్యేక డ్రైవ్ ను నిర్వ‌హించింది. అయిన‌ప్ప‌టికీ అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 50% కంటే తక్కువ మంజూరు, పంపిణీ రేటును క‌లిగి ఉండ‌డం గ‌మ‌నార్హం.

KCR Politics : ఔను! వాళ్లిద్ద‌రూ చెరోదారి!!

తెలంగాణ, కేరళ, లడఖ్, జమ్మూ&కాశ్మీర్, అండమాన్ & నికోబార్ దీవులు, పుదుచ్చేరి, గోవా, హిమాచల్ ప్రదేశ్, మిజోరం లు మాత్ర‌మే 70% కంటే ఎక్కువ మంజూరు రేటు క‌లిగి ఉన్నాయి. ఆ మేర‌కు ప్రభుత్వ డేటా స్ప‌ష్టం చేస్తోంది. పదహారు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ ప‌థ‌కాన్ని వినియోగించుకోవ‌డంలో వెనుక‌బ‌డ్డాయి. ఆ జాబితాలో — మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్, ఢిల్లీ, డామన్ & డయ్యూ, చండీగఢ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ ఉన్నాయి. ఇవి కేవ‌లం 50 నుంచి 60శాతం మంజూరు రేటును క‌లిగి ఉన్నాయి. ఇక‌ ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, బీహార్, పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, అస్సాం, సిక్కిం – మంజూరు రేటు 50% లోపుగానే ఉంది. మొత్తం రుణ దరఖాస్తుల సంఖ్యకు సంబంధించి ఏడు రాష్ట్రాలు/UTలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. వాటిలో తెలంగాణ, లడఖ్, జమ్మూ & కాశ్మీర్, అండమాన్ & నికోబార్ దీవులు, గోవా, హిమాచల్ ప్రదేశ్, మిజోరం — 70% కంటే ఎక్కువ రేటును కలిగి ఉండ‌డం విశేషం.మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిషా, జార్ఖండ్, ఢిల్లీ, పుదుచ్చేరి, చండీగఢ్, ఉత్తరాఖండ్, నాగాలాండ్, త్రిపుర మరియు మేఘాలయ రాష్ట్రాలు/UTలు 50-69% మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేశాయి. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, బీహార్, పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, డామన్ & డయ్యూ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మరియు సిక్కింలకు 50% కంటే తక్కువగా ద‌ర‌ఖాస్తుల‌ను పంపిణీ రేటు
ఉండ‌డం గ‌మ‌నార్హం.

Exit mobile version