SBI Clerk – 5000 Jobs : ఎస్బీఐలో మరో 5000 జాబ్స్.. త్వరలో నోటిఫికేషన్

SBI Clerk - 5000 Jobs : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ విభాగంలో మొత్తం 5 వేలకుపైగా క్లర్క్ జాబ్స్‌ను భర్తీ చేయనున్నారు.

  • Written By:
  • Updated On - October 25, 2023 / 03:58 PM IST

SBI Clerk – 5000 Jobs : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ విభాగంలో మొత్తం 5 వేలకుపైగా క్లర్క్ జాబ్స్‌ను భర్తీ చేయనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ రిలీజ్ కానుంది. ఈ నోటిఫికేషన్ విడుదలయ్యాక ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు సమర్పించవచ్చు. ఏదైనా డిగ్రీ చేసినవారు ఈ జాబ్స్‌కు దరఖాస్తు చేసేందుకు అర్హులు. డిగ్రీ చివరి సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేయొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి వయసు 20 నుంచి 28 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడీబ్ల్యూడీ(జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు 10 సంవత్సరాలపాటు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా ఈ జాబ్స్‌కు ఎంపిక చేస్తారు. ఎగ్జామ్ స్థానిక భాషలోనూ ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు(SBI Clerk – 5000 Jobs) ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఎస్‌బీఐ పీవో అడ్మిట్ కార్డులు

ఇక ఎస్‌బీఐ పీవో-2023 ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులను ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. పీవో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/రోల్ నెంబర్, పాస్‌వర్డ్/పుట్టినతేది వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు. నవంబరు 6 వరకు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉండనున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 1, 4, 6 తేదీల్లో పీవో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.

Also Read: Indians Honoured : బైడెన్ నుంచి అవార్డులు.. ఇద్దరు ఇండియా సైంటిస్టుల ఘనత