SSC Jobs : టెన్త్, ఇంటర్‌తోనూ 2049 జాబ్స్.. ఎస్​ఎస్​సీ నోటిఫికేషన్

SSC Jobs :  2,049 పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్​ఎస్​సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.

Published By: HashtagU Telugu Desk
Ssc Website

Ssc Website

SSC Jobs :  2,049 పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్​ఎస్​సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో జనరల్ పోస్టులు – 186, ఓబీసీ పోస్టులు 456, ఈడబ్ల్యూఎస్ పోస్టులు 186, ఎస్టీ పోస్టులు 124, ఎస్సీ పోస్టులు 255 ఉన్నాయి.  టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా కోర్సులు చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఈమేరకు వివరాలతో  ‘సెలక్షన్​ పోస్ట్​ ఫేజ్​-12’ రిక్రూట్​మెంట్​కు సంబంధించిన ప్రకటనను ఎస్​ఎస్​సీ విడుదల చేసింది. ఈ పరీక్షలో ఎంపికయ్యే అభ్యర్థులను వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నియమిస్తారు.

We’re now on WhatsApp. Click to Join

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC Jobs) పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. కొన్ని కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్​మెన్ అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన పనిలేదు. 2,049 పోస్టుల భర్తీలో భాగంగా అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. దానిలో ఉత్తీర్ణులయ్యే వారికి స్కిల్ టెస్ట్​ – టైపింగ్/ డేటా ఎంట్రీ/ కంప్యూటర్​ ప్రొఫిషియన్సీ టెస్ట్​ చేస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయ్యే వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్​ చేసి జాబ్‌కు ఎంపిక చేస్తారు. దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 26న ప్రారంభమైంది. మార్చి 18 వరకు అప్లికేషన్లను స్వీకరిస్తారు. పరీక్షను మే 6, 8 తేదీలలో నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎస్​ఎస్​సీ అధికారిక వెబ్​సైట్​ https://ssc.gov.in/ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది.

Also Read : Space Port : దేశంలో రెండో అంతరిక్ష కేంద్రం విశేషాలివీ..

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) 314 ఆపరేటర్-కమ్​-టెక్నీషియన్ ట్రైనీ (ఓసీటీటీ) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. మెటలర్జీ – 57 పోస్టులు, ఎలక్ట్రికల్ – 64 పోస్టులు, మెకానికల్ – 100 పోస్టులు, ఇన్​స్ట్రుమెంటేషన్ – 39 పోస్టులను ఇందులో భాగంగా భర్తీ చేయనున్నారు.

ఇతర పోస్టులు ఇవీ.. 

  • సివిల్ – 18 పోస్టులు
  • కెమికల్ – 18 పోస్టులు
  • సిరామిక్ – 6 పోస్టులు
  • ఎలక్ట్రానిక్స్ – 8 పోస్టులు
  • కంప్యూటర్/ఐటీ – 20 పోస్టులు
  • డ్రాఫ్ట్స్​మెన్​ – 2 పోస్టులు
  • మొత్తం పోస్టులు – 314

Also Read : March 1st : మార్చి 1 విడుదల.. కొత్త నెల కొత్త రూల్స్

  Last Updated: 28 Feb 2024, 04:10 PM IST