Site icon HashtagU Telugu

8326 Jobs : టెన్త్ అర్హతతో 8,326 జాబ్స్.. అప్లై చేసుకోండి

Ssc Mts Notification

8326 Jobs : మొత్తం 8326 పోస్టులతో స్టాఫ్​ సెలక్షన్ కమిషన్​ (ఎస్​ఎస్​సీ) భారీ నోటిఫికేషన్‌ను(8326 Jobs) విడుదల చేసింది. వీటిలో 4887 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పోస్టులు, 3439 హవల్దార్ పోస్టులు ఉన్నాయి. పదో తరగతి పాసైన వారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. 2024 ఆగస్టు 1 నాటికి 18-25 ఏళ్లలోపు వయసు కలిగినవారు ఎంటీఎస్(Multi Tasking Staff)  పోస్టులకు, 18 – 27 ఏళ్లలోపు వయసు కలిగినవారు హవల్దార్​ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. https://ssc.gov.in/ వెబ్​సైట్ ద్వారా అభ్యర్థులను దరఖాస్తును సమర్పించవచ్చు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జులై 31. అప్లికేషన్‌లో కరెక్షన్ చేసుకోవడానికి ఆగస్టు 10, 11 తేదీలలో అవకాశం కల్పిస్తారు. 2024 అక్టోబర్ – నవంబర్ మధ్య ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష జరుగుతుంది. ​

We’re now on WhatsApp. Click to Join

అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో తొలుత ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. తదుపరిగా ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్​ (PET), ఫిజికల్ స్టాండర్డ్​ టెస్ట్​ (PST) ఉంటాయి. చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. హవల్దార్ పోస్టులకు ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ జరుగుతుంది. ఇందులో పాల్గొనే పురుషులు 1600 మీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో, మహిళలు ఒక కిలోమీటర్ దూరాన్ని 20 నిమిషాల్లో చేరుకోవాలి. ఇక ఫిజికల్ స్టాండర్డ్​  టెస్టులో పురుషులు 157.5 సెం.మీ ఎత్తు ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు ఛాతీ విస్తీర్ణం కనీసం 5 సెం.మీ, పెరిగి 81 సెం.మీకు తక్కువ కాకుండా ఉండాలి. మహిళలు 152 సెం.మీ ఎత్తు, 48 కిలోల బరువు ఉండాలి. ఇక జనరల్, ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.100 ఉంటుంది.  మహిళలు, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలకు అప్లికేషన్ ఫీజు ఉండదు. ఈ జాబ్స్‌కు ఎంపికయ్యే వారికి ప్రతినెలా రూ.18వేల బేసిక్ శాలరీ లభిస్తుంది. డీఏ, హెచ్​ఆర్​ఏ, ఇతర అలవెన్సులు కలుపుకొని రూ.35,000 వరకు శాలరీ లభిస్తుంది.