SSC Jobs : పోలీసు ఉద్యోగాలకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని భద్రతా విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడినప్పుడల్లా అప్లికేషన్లు వెల్లువెత్తుతుంటాయి. సెప్టెంబరు 5న మరో పెద్ద నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) విడుదల చేయబోతోంది. ఇందులో భాగంగా వేలాది జీడీ కానిస్టేబుల్ పోస్టులను(SSC Jobs) భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) వార్షిక క్యాలెండర్ 2024-25 ప్రకారం ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు, అసోం రైఫిల్స్‌లో రైఫిల్ మ్యాన్ (జనరల్ డ్యూటీ), ఎన్‌సీబీలో సిపాయి పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి పాసైన వారు వీటికి అర్హులు. 18 నుంచి 23 ఏళ్లలోపు వారు మాత్రమే అప్లై చేయాలి. వయో పరిమితిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల మినహాయింపు ఇస్తారు. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెంటీమీటర్లు, మహిళా అభ్యర్థుల ఎత్తు 157 సెంటీమీటర్లకు తగ్గకూడదు.
Also Read :Bail Rule : ఈడీ కేసుల్లోనూ నిందితులకు బెయిల్ రూల్.. సుప్రీంకోర్టు కీలక కామెంట్స్
ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు తొలుత రాత పరీక్షను నిర్వహిస్తారు. 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు జరిగే అవకాశం ఉంది. ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ పరీక్షలో మొత్తం 80 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. పరీక్ష వ్యవధి 1 గంట. జనరల్ ఇంటెలీజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్/ హిందీ విభాగాలపై ప్రశ్నలు ఉంటాయి. రాతపరీక్షలో పాసయ్యే వారికి ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. చివరగా సర్టిఫికెట్లను పరిశీలించి, రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.