Site icon HashtagU Telugu

Smoke in Spicejet:స్పైస్ జెట్ విమానంలో పొగలు.. ఊపిరాడ‌క ప్రయాణికుల ఇబ్బంది

Spicejet Smoke

Spicejet Smoke

ఢిల్లీ నుంచి జ‌బ‌ల్‌పూర్‌కు బ‌య‌లుదేరిన స్పైస్ జెట్ విమానం అది. టేకాఫ్ అయిన కాసేప‌టికే లోపల పొగ‌లు క‌మ్ముకున్నాయి.
స్పైస్‌జెట్ విమానం శనివారం ఉదయం 5000 అడుగులు దాటుతుండగా క్యాబిన్‌లో పొగలు ఏర్పడ్డాయి. దీంతో ప్ర‌యాణికులు ఊపిరాడ‌క ఇబ్బంది ప‌డ్డారు. హుటాహుటిన విమానాన్ని పైలట్ వెనక్కి మళ్లించి ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు. ప్ర‌యాణికులంద‌రూ క్షేమంగానే ఉన్న‌ట్లు స్పైస్ జెట్ తెలిపింది.
బీహార్‌లోని పాట్నా ఎయిర్‌పోర్టులో గ‌త నెల 19న‌ స్పైస్ జెట్ విమానంలో మంట‌లు చెల‌రేగాయి.

దీంతో విమానాన్ని ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న 185 మందిని సిబ్బంది సుర‌క్షితంగా బ‌య‌ట‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన ప‌ది రోజుల వ్య‌వ‌ధిలోనే మ‌ళ్లీ స్పైస్ జెట్ విమానంలో పొగ‌లు చెల‌రేగ‌డం ప్ర‌యాణికుల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్న‌ది. స్పైస్ జెట్ విమానాల్లో రెండు వారాల్లో ఇది రెండో ప్రమాదం.

 

Exit mobile version