Ayodhya Ram Temple : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిర నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు ఒక డేట్‌ను ఫిక్స్ చేశారు. 2025 మార్చి నాటికి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. ఇక ఆలయం వెలుపలి వైపు నిర్మించే చిన్న ఆలయాలు, లిఫ్ట్ నిర్మాణ పనులను 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు అదనంగా 200 మంది శిల్పులను నియమించారు.
We’re now on WhatsApp. Click to Join
ఇప్పటికే అయోధ్య రామ మందిరం(Ayodhya Ram Temple) గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయింది. ఆలయం మొదటి అంతస్తు, శిఖరం నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. దీన్ని మరింత వేగంగా పూర్తి చేయడం కోసం, అదనపు ఉద్యోగులను నియమించి స్తంభాలను చెక్కిస్తున్నారు. ప్రస్తుతానికి దాదాపు 1,400 మంది శిల్పకారులు రాతి స్తంభాలను చెక్కుతున్నారు. వీరికి అదనంగా మరో 200 మందిని నియమించారు. ఆలయం లోపలి భాగంలో 11 దేవాలయాలు నిర్మిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో మరిన్ని శిల్పాలను కూడా చేయిస్తున్నారు. ఈ పనులన్నీ 2025 మార్చి నాటికి పూర్తి అవుతాయి.
Also Read :Electoral Bonds Data : ఎలక్టోరల్ బాండ్ల కు కేరాఫ్ గా మేఘా ఇంజినీరింగ్ సంస్థ..?
వారికి లిఫ్ట్ సౌకర్యం
అయోధ్య రామ మందిర దర్శనానికి వచ్చే వారిలో దివ్యాంగులు, పెద్దలు కూడా ఉంటారు. ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఆలయ ప్రాంగణంలోని బేస్మెంట్ సమీపంలో పశ్చిమ, దక్షిణ ద్వారాల వద్ద లిఫ్టులను నిర్మిస్తున్నారు. వీటి ద్వారా వారు సౌకర్యవంతంగా దైవ దర్శనం చేసుకోవడానికి వీలవుతుంది.
Also Read :TG 09 0001 : టీజీ 09 0001 నంబరుకు రూ.9.61 లక్షలు
అయోధ్య బాలరాముడికి ఇంకా కానుకలు వస్తూనే ఉన్నాయి. 1100 కిలోల బరువున్న భారీ సంగీత వాయిద్యం తబలాను అయోధ్య రాముడి కోసం తీసుకువచ్చింది మధ్యప్రదేశ్‌కు చెందిన శివ బరాత్ జన్ కళ్యాణ్ సమితి బృందం. బుధవారం దీనిని రామసేవక్ పురంలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేసింది.ఇప్పటికే రామయ్యకు 2500 కిలోల భారీ గంట, 400 కిలోల తాళం, 108 అడుగుల బాహుబలి అగరుబత్తి సహా ఎన్నో రకాల కానుకలను రామ భక్తులు అందించారు.