Site icon HashtagU Telugu

Car Hits Bike: బైక్‌ను ఢీకొని 4 కి.మీలు ఈడ్చుకెళ్లిన కారు.. ప్రాణాలతో బయటపడిన యువకులు

Car Hits Bike

Resizeimagesize (1280 X 720) (2) 11zon

ఢిల్లీకి చెందిన అంజలి అనే యువతిని కారు ఢీకొని 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన తరహా మరో ఘటన హర్యానాలో వెలుగు చూసింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను వేగంగా వస్తున్న కారు ఢీకొని నాలుగు కిలోమీటర్లు మేర ఈడ్చుకుని వెళ్లింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు యువకులు త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గతంలో ఢిల్లీలో జరిగిన హృదయ విదారకమైన కంఝవాలా ఘటన గురుగ్రామ్‌లోనూ కనిపించింది. దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ఓ కారు బైక్‌ను ఈడ్చుకెళ్లింది. అదృష్టవశాత్తూ బైక్‌ కారు కింద ఇరుక్కుపోవడంతో బైక్‌పై వెళ్లే వారిద్దరూ కిందపడిపోయారు. దీంతో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. చాలా దూరం వెళ్లాక బైక్ గుంతలో కూరుకుపోవడంతో ఇది గమనించిన కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: Air India: విమానానికి తప్పిన పెను ప్రమాదం.. ప్రమాద సమయంలో 184 మంది ప్రయాణికులు

రిథోజ్‌ గ్రామానికి చెందిన రోహిత్‌, హృతిక్‌ బుధవారం సాయంత్రం బైక్‌పై తమ కంపెనీ నుంచి రిథోజ్‌ గ్రామానికి వెళ్తున్నారు. సెక్టార్-62 నుంచి గోల్ఫ్ కోర్స్ ఎక్స్‌టెన్షన్ రోడ్డు వద్దకు రాగానే ఓ కారు వారి బైక్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే ఇద్దరూ బైక్‌పై నుంచి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత కారు ఆపడానికి బదులు కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు బైక్‌ను నాలుగు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లినట్లు సమాచారం. డ్రైవర్ తాగి ఉన్నాడని కూడా చెబుతున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు సెక్టార్-65 పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వాహనం నంబర్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. విషయం చాలా తీవ్రమైనదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Exit mobile version